Site icon HashtagU Telugu

Kamal Nath: బీజేపీలో చేరిక పై స్పందించిన క‌మ‌ల్ నాథ్

Congress Leader Kamal Nath Says Buzz Of His Switch To Bjp Created By Media

Congress Leader Kamal Nath Says Buzz Of His Switch To Bjp Created By Media

 

Kamal Nath : మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత క‌మ‌ల్ నాథ్(Kamal Nath) తాను బీజేపీ(bjp)లో చేరుతున్నాన‌నే వార్త‌ల‌ను తోసిపుచ్చారు. కాషాయ పార్టీలో చేరుతున్నాన‌ని తాను చెప్ప‌డం ఎవ‌రైనా విన్నారా..? ఈ దిశ‌గా ఎలాంటి సంకేతాలు తానేమైనా పంపానా..? అలాంటిదేమీ లేద‌ని క‌మ‌ల్ నాథ్ తేల్చిచెప్పారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చింద్వారా జిల్లాలో మంగ‌ళ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో క‌మ‌ల్ నాథ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో చింద్వారా జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న అయిదు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. తాను బీజేపీలో చేరుతున్నాన‌ని మీడియా ప్ర‌చారం చేస్తోంద‌ని, దీనిపై తిరిగి త‌న స్పంద‌న‌ను కోరుతోంద‌ని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో అకాల వ‌ర్షాలు, పిడుగుపాటుకు పంట దెబ్బ తిన్న రైతాంగాన్ని ఆదుకోవాల‌ని క‌మ‌ల్ నాథ్ కోరారు. బాధిత రైతుల‌కు త‌గిన ప‌రిహారం చెల్లించాల‌ని సీఎంకు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ప్ర‌భుత్వం అప్పుల‌తో నెట్టుకొస్తోంద‌ని రుణాల‌పైనే ప్ర‌భుత్వాన్ని కాషాయ పార్టీ న‌డిపిస్తోంద‌ని క‌మ‌ల్ నాథ్ ఆరోపించారు.

read also : Hanuma Vihari : ఏపీలో కాకరేపుతున్న హనుమ విహారి కెఫ్టెన్సీ తొలగింపు..