Rajyasabha Elections : విలాస‌వంత‌మైన హోట‌ళ్ల‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల త‌ర‌లింపు

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజ‌కీయాల‌కు తెర‌లేపింది.

  • Written By:
  • Updated On - June 3, 2022 / 04:07 PM IST

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజ‌కీయాల‌కు తెర‌లేపింది. ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డానికి రాజ‌స్థాన్ , హ‌ర్యానా కాంగ్రెస్ విలాస‌వంత‌మైన హోట‌ళ్ల లో శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఉదయ్‌పూర్‌లోని తాజ్ ఆరావళి రిసార్ట్ రాజస్థాన్‌లోని శాసనసభ్యులకు తాత్కాలిక చిరునామాగా మారింది. ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని మేఫెయిర్ లేక్ రిసార్ట్ హర్యానా ఎమ్మెల్యేల‌కు శిబిరంగా మారింది. కాంగ్రెస్ తన 108 మంది రాజస్థాన్ ఎమ్మెల్యేలు, మరికొందరు స్వతంత్రులు, మద్దతిస్తున్న ఇత‌ర ఎమ్మెల్యేలను ఉదయపూర్ రిసార్ట్ కు త‌ర‌లించింది. జూన్ 4 నుండి 9 వరకు ఉంచడానికి రిసార్ట్స్ ను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌ను నివారించాల‌ని ప‌క్కా ప్లాన్ చేస్తోంది. ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన నిఘాలో ఉంచుతున్నారు. రిసార్ట్‌ నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లేలా స్కెచ్ వేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలతోనే ఉంటారని కూడా తెలిసింది. క్రాస్ ఓటింగ్ తమ అభ్యర్థి అజయ్ మాకెన్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న హర్యానా నాయకత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు ఒకటి గెలుచుకునే సంఖ్య ఉంది. అయితే మరో మాజీ కాంగ్రెస్ నాయకుడు వినోద్ శర్మ కుమారుడు కార్తికేయ శర్మ ప్రవేశించడం లెక్కను తారుమారు చేస్తుందని అనుమానిస్తున్నారు.

31 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీలోని ఎంపీ దీపేందర్ హుడా నివాసానికి “శిక్షణా సెషన్” కోసం పిలిపించారు, అందులో 28 మంది హాజరయ్యారు. ఆ తర్వాత విమానంలో రాయ్‌పూర్‌కు వెళ్లి అక్కడ మేఫెయిర్ రిసార్ట్ జూన్ 9 వరకు బుక్ చేయబడింది. ఓటింగ్ సమయంలో పార్టీ విప్‌ను అనుసరించాల్సిన ఆవశ్యకత గురించి ఎమ్మెల్యేలకు తెలియజేయడానికి ఈ సెషన్‌ని ఆ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల రవాణాను పర్యవేక్షిస్తున్న మరో కాంగ్రెస్ కార్యకర్త, రిసార్ట్‌లో ఛత్తీస్‌గఢ్ నాయకుడి కుమార్తె వివాహాన్ని నిర్వహిస్తామని, దీని కోసం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ హర్యానా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆహ్వానించారని పేర్కొన్నారు. .