Site icon HashtagU Telugu

Akshay Kanti Bam : బీజేపీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థి.. నామినేషన్ విత్‌డ్రా

Akshay Kanti Bam

Akshay Kanti Bam

Akshay Kanti Bam :  సూరత్‌లో తగిలిన షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోకముందే.. మరో షాక్ తగిలింది. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్‌ను  ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. బీఎస్పీ సహా ఇతర పార్టీల అభ్యర్థులంతా పోటీ  నుంచి తప్పుకొని సూరత్ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ చేశారు.  తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్  లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి  అక్షయ్ కాంతి బామ్ రాజకీయ విలువలకు పాతరేస్తూ బీజేపీలోకి జంప్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ తనకు లోక్‌సభ టికెట్ ఇచ్చిందనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి  ఐదు రోజుల క్రితమే (ఏప్రిల్ 24న) అక్షయ్ బామ్ నామినేషన్ వేశారు. తాజాగా సోమవారం ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ ఫామ్‌ను ఉపసంహ రించుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి  ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు అక్షయ్ వెళ్లడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ నేత అక్షయ్‌కు(Akshay Kanti Bam) ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ స్వాగతం పలుకుతున్నట్లుగా బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ ఓ ట్వీట్ చేశారు.ఇందులో తనతో పాటు అక్షయ్ దిగిన సెల్ఫీ ఫొటోను కైలాష్ విజయవర్గీయ పోస్ట్ చేశారు. ఇండోర్, ఉజ్జయిని, ధార్ సహా ఎనిమిది లోక్‌సభ స్థానాలకు నాలుగో దశలో మే 13న ఓటింగ్ జరుగుతుంది.

Also Read : KTR : దేవెగౌడ మనవడు పారిపోయేందుకు మోడీ సర్కారు సాయం : కేటీఆర్