Site icon HashtagU Telugu

Rahul Gandhi : ఔను.. అప్పుడు దళితులు, బీసీలను కాంగ్రెస్ విస్మరించింది.. రాహుల్‌ వ్యాఖ్యలు

Rahul Gandhi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేళ  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి దళితులు, బీసీలను ఉద్దేశించి ఆయన ముఖ్యమైన కామెంట్స్ చేశారు. 1990వ దశకంలో దళితులు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ అంశాన్ని తమ పార్టీ విస్మరించిందని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ హయాంలో దళితులు, మైనారిటీలు, బీసీల ప్రయోజనాలను కాపాడగలమనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదని ఆయన చెప్పారు. 1990వ దశకంలో కాంగ్రెస్‌లో పరిస్థితులు కొంత మారాయని.. దళితులు, బీసీల ప్రయోజనాల పరిరక్షణ అంశంలో తగిన రీతిలో పార్టీ స్పందించలేకపోయిందని రాహుల్(Rahul Gandhi) ఒప్పుకున్నారు. ‘వంచిత్ సమాజ్ : దశ ఔర్ దిశ’ పేరుతో న్యూదిల్లీలో దళిత ఇన్‌ఫ్లూయెన్సర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

Also Read :Gandhiji Historic Places : ఇవాళ గాంధీజీ వర్ధంతి.. ఆయనతో ముడిపడిన 7 చారిత్రక ప్రదేశాలివీ

రాజకీయాల్లో చోటు పొందినంత మాత్రాన దళితులు, బీసీల సమస్యలు పరిష్కారం కావని రాహుల్ అన్నారు. వాళ్లు ప్రభుత్వ వ్యవస్థల్లో, సంపదలో భాగాన్ని పొందే స్థాయికి ఎదగాలని సూచించారు. బీజేపీ వాళ్లు దళితులు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రాధాన్యం లేని అంశంగా మార్చారని రాహుల్ మండిపడ్డారు. లోక్‌సభలో కొందరు బీజేపీ ఎంపీలు ఈవిషయాన్ని చెబుతుంటే తాను విన్నానని ఆయన చెప్పారు. ‘‘దళితులు, బీసీ వర్గం ప్రజాప్రతినిధులను మాట్లాడలేని విగ్రహాల్లా మార్చాం’’ అని  ఆ బీజేపీ ఎంపీలు చెబుతుండగా తాను విన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. విద్యారంగం, న్యాయ రంగం, కార్పొరేట్ ప్రపంచం ఇలా అన్నిచోట్ల దళితులు అధికార వాటా పొందాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read :Budget 6 Key Announcements : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో 6 కీలక ప్రకటనలు.. ఇవే ?

దేశంలో బీసీలు 50 శాతముంటే, అధికారంలో వారికి 5 శాతం వాటాయే ఉందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు దేశంలో 15 శాతముంటే, అధికారంలో వారికి 1 శాతం వాటాయే ఉందన్నారు. ఈ పరిస్థితులు మారాలని, మార్చాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.