Yogi : ‘కాంగ్రెస్‌ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తోంది’: యోగి ఆదిత్యనాథ్‌

  • Written By:
  • Publish Date - April 8, 2024 / 12:41 PM IST

Yogi Adityanath: దేశానికి కాంగ్రెస్‌ పార్టీనే పెద్ద సమస్య అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) అన్నారు. రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ (Congress ) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. ‘దేశానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్ద సమస్య. కర్ఫూలు విధించడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తే.. కాంగ్రెస్‌ మాత్రం ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది’ అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

అదే బీజేపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు కొదవలేదని యెగి అన్నారు. గత నాలుగేళ్లలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తోందని గుర్తు చేశారు. మోడీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ప్రతిష్ఠ పెరిగిందన్నారు. ఉగ్రవాదం కూడా ముగిసిపోయిందన్నారు. దేశం మొత్తం మరోసారి మోదీడీ నాయకత్వం రావాలని నినదిస్తోంది అని యోగి పేర్కొన్నారు.

Read Also: Break Up Leaves : ఉద్యోగులకు బ్రేకప్ లీవ్స్.. సంచలన నిర్ణయంపైనే అంతటా చర్చ

“అయోధ్యలో రామమందిరాన్ని కాంగ్రెస్ నిర్మించలేకపోయింది. రాముడు లేడని చెప్పేవారు. భరత్‌పూర్ పక్కన మధుర, బృందావన్, గోకుల్, బర్సానా, నంద్‌గావ్ మరియు గోవర్ధన్ ఉన్నాయి. అయినా శ్రీకృష్ణుడు ఎప్పుడూ లేడని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ మన చరిత్రను, వారసత్వాన్ని ప్రశ్నిస్తోందని ఆయన అన్నారు.

Read Also: Prabhas : తెలంగాణలో జరిగిన ఆ యుద్ధంతో ప్రభాస్, హను రాఘవపూడి సినిమా..

ఇటీవల ‘ది గార్డియన్’ నివేదికపై ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులను ఎంపిక చేసి చంపేస్తున్నారని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి పెనుముప్పు అని ప్రపంచం కూడా గ్రహిస్తోంది..అని యూపీ సీఎం వ్యాఖ్యానించారు.