Site icon HashtagU Telugu

Congress: కాంగ్రెస్‌కి భారీ ఎదురుదెబ్బ..సావిత్రి జిందాల్‌ రాజీనామా

111

Congress: Former Haryana minister Savitri Jindal resigns ahead of LS elections 2024

 

Savitri Jindal: ఓపీ జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌(OP Jindal Group Chairperson), హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్(Savitri Jindal) కాంగ్రెస్‌(Congress) పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. జిందాల్‌ తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను పది సంవత్సరాలుగా హిసార్‌ ఎమ్మెల్యేగా ప్రజలకు ప్రాతినిథ్యం వహించానని.. రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేశానన్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ నాయకత్వానికి, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, 2005 జిందాల్ హిసార్ నియోజకవర్గం నుంచి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆమె భర్త ఓం ప్రకాశ్‌ జిందాల్ చాలాకాలం పాటు హిసార్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. 29 అక్టోబర్ 2013న హర్యానా ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా నియామకమయ్యారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ, గృహనిర్మాణం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హర్యానా శాసనసభ సభ్యురాలిగా చేశారు. 2010 వరకు విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగారు. 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి ఓడిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఆమె వయస్సు 84 సంవత్సరాలు. జిందాల్ గ్రూప్ భారీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మార్చి 28, 2024 నాటికి, సావిత్రి జిందాల్ నికర విలువ 29.6 బిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.2.47 లక్షల కోట్లు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు.

Read Also: Election Commission : రెండో విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఇదిలా ఉండగా.. సావిత్రీ జిందాల్‌ కుమారుడు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (JSPL) చైర్మన్ నవీన్ జిందాల్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నవీన్‌ జిందాల్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సావిత్రి జిందాల్‌ పది సంవత్సరాల పాటు హిసార్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. హర్యానా ప్రభుత్వంలో మంత్రిగానూ సేవలందించారు. 2005లో జిందాల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు ఓపీ జిందాల్‌ విమాన ప్రమాదంలో మరణించిన అనంతరం హిసార్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.