Congress Files:CBIవ‌జ్రోత్స‌వ వేళ కాంగ్రెస్ ఫైల్స్!BJPప్ర‌తిదాడి!

సీబీఐ వ‌జ్రోత్స‌వ వేళ కాంగ్రెస్ ఫైల్స్ ను(Congress Files)బీజేపీ బ‌య‌ట‌కు తీసింది.యూపీఏ దేశాన్ని

  • Written By:
  • Publish Date - April 3, 2023 / 02:33 PM IST

సీబీఐ వ‌జ్రోత్స‌వ వేళ కాంగ్రెస్ ఫైల్స్ ను(Congress Files) బీజేపీ బ‌య‌ట‌కు తీసింది. యూపీఏ ప్ర‌భుత్వం దేశాన్ని వెన‌క్క నెట్టిందని చెబుతూ వెబ్ సీరిస్ సిద్ధ‌మ‌యింది. యూపీఏ-1, యూపీఏ-2 ప్ర‌భుత్వాల హ‌యాంలో ట్రిలియ‌న్ డాల‌ర్ల అవినీతి(Corruption) జ‌రిగింద‌ని ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని పత్రాల‌ను జోడీస్తూ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ను బీజేపీ విడుద‌ల చేసింది. మ‌రుస‌టి రోజే (సోమ‌వారం) సీబీఐ ప‌రిధిని పెంచామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో ప్రశంసించారు.

సీబీఐ వ‌జ్రోత్స‌వ వేళ కాంగ్రెస్ ఫైల్స్ ను(Congress Files)

ప‌దేళ్ల క్రితం అవినీతి (Corruption) చేయ‌డానికి పోటీ జ‌రిగింద‌ని యూపీఏ హ‌యాంను మోడీ గుర్తు చేశారు. యూపీఏ ఉన్న 10ఏళ్ల పాటు స్కామ్ ల టైమ్ గా అభివ‌ర్ణించారు. ఆ స‌మ‌యంలో నిందితులు భ‌య‌ప‌డ‌లేదు. కార‌ణం వాళ్ల‌కు వ్య‌వ‌స్థ‌లు అండ‌గా నిలిచాయ‌ని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి వ‌చ్చిన 2014 నుంచి అవినీతిని ఏరిపారేస్తున్నామ‌ని చెప్పారు. న‌ల్ల‌ధ‌నంకు వ్య‌తిరేకంగా పోరాడుతున్నామ‌ని అన్నారు. ప్రస్తుతం సాధారణ పౌరులకు ఆశ మరియు బలాన్ని సీబీఐ ఇచ్చింద‌ని కొనియాడారు. న్యాయానికి బ్రాండ్‌గా సిబిఐ ఉంద‌ని, అందుకే, సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నార‌ని మోడీ అభిప్రాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. బ్యాంకు మోసాల నుండి వన్యప్రాణులకు సంబంధించిన మోసాల వరకు, సిబిఐ పని పరిధిని చాలా రెట్లు పెంచుకుంద‌ని ప్ర‌శంసించారు. దేశాన్ని అవినీతి రహితంగా మార్చడం సీబీఐ ప్రధాన విధిగా మోడీ చెప్ప‌డం ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు.

పౌరులకు ఆశ మరియు బలాన్ని సీబీఐ ఇచ్చింద‌ని..

భారతీయ జనతా పార్టీ ఆదివారం కాంగ్రెస్ ఫైల్స్(Congress Files) పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌కు తీస్తూ ఆ వీడియోను చిత్రీక‌రించారు. 2004-2014 మధ్య పదేళ్ల యూపీఏ పాలనలో బయటపడిన అవినీతి కేసులను ఆ వీడియోలో పొందుప‌రించింది. యుపిఎ పదేళ్ల పాలనను కోల్పోయిన దశాబ్దంగా పేర్కొంటూ, గత 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 48,20,69,00,00,000 రూపాయల అవినీతి జరిగిందని బిజెపి పేర్కొంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కూడా బీజేపీ దాడి చేసింది. అవినీతిని అనుమ‌తించిన మ‌న్మోభ‌హ‌న్ సింగ్ గా ఆరోపిస్తూ ఆయనను “మౌనీబాబా” అని పిలిచింది. ఈ భారీ మొత్తాన్ని దేశ ప్రగతికి ఎలా ఉపయోగించవచ్చో పార్టీ వివరించింది. 48,20,69 కోట్ల కొనుగోలు శక్తి గురించి వివరించింది. ఈ మొత్తాన్ని 24 ఐఎన్‌ఎస్ విక్రాంత్, 300 రాఫెల్ జెట్‌ల కొనుగోలుకు, 1,000 మంగళ్ మిషన్‌ల అమలుకు వినియోగించవచ్చని పేర్కొంది.

Also Read : Congress Files: 70 ఏళ్లలో 4.8 లక్షల కోట్ల కుంభకోణాలు చేసిందంటూ కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో బీజేపీ ప్రచారం

విడుద‌ల చేసిన మొద‌టి ఎపిసోడ్ కాంగ్రెస్ అవినీతికి(Corruption) సంబంధించిన ట్రైలర్ మాత్రమేనని, సినిమా మిగిలి ఉందని బీజేపీ పేర్కొంది. ఇటీవ‌ల పార్ల‌మెంట్ వేదిక‌గా మోడీ స‌ర్కార్ అవినీతి గురించి కాంగ్రెస్ వెలుగెత్తి చాటింది. ఆదానీ-హిడెన్ బ‌ర్గ్ వ్య‌వ‌హారం మీద చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టింది. అంతేకాదు, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను అడ్డుపెట్టుకుని మోడీ స‌ర్కార్ విప‌క్షాల‌ను క‌ట్ట‌డీ చేయాల‌ని చూస్తుంద‌ని మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే చేసిన ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా కాంగ్రెస్ ఫైల్స్ ను బీజేపీ వెబ్ సీరిస్ ను విడుద‌ల చేసింది. బిలియనీర్ గౌతమ్ అదానీ షెల్ కంపెనీలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖర్గే ట్వీట్లలో రూ. 20,000 కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని ప్రశ్నించారు. ఇలా, కాంగ్రెస్ పార్ల‌మెంట్ వెలుప‌ల‌, లోప‌ల చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు కౌంట‌ర్ గా వెబ్ సీరియ‌స్ (Congress Files)ను బీజేపీ విడుద‌ల చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ అంటూ యూపీఏ హ‌యాంలోని బాగోతాల‌ను బ‌య‌ట పెడుతోంది. మొత్తం మీద బీజేపీ, కాంగ్రెస్ దేశ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది. ప‌ర‌స్ప‌ర అవినీతి ఆరోప‌ణ‌ల‌ను గుప్పించుకుంటున్నారు.

Also Read : T Congress : రాహుల్ గాంధీ అనర్హత వేటుపై టీ కాంగ్రెస్ పోస్ట్ కార్డు ఉద్య‌మం