Site icon HashtagU Telugu

Rahul Gandhi : స‌భ‌లు, ర్యాలీల‌కు ‘రాహుల్’ నో

Rahul Rally

Rahul Rally

కోవిడ్ మూడో వేవ్ త‌రుముకొస్తోంది. ఆ క్ర‌మంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు దూరంగా ఉండాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్ నిర్ణ‌యించుకున్నాడు. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా రాహుల్ ఆనాడు రెండో వేవ్ కార‌ణంగా ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు దూరంగా ఉన్నాడు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి, మార్చి లో జ‌రిగే అవ‌కాశం ఉంది. అందుకే, ఆయా పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నాయి. కానీ, రాహుల్ వెనక్కు త‌గ్గ‌డం చ‌ర్చనీయాంశం అయింది.ప్ర‌స్తుతం కోవిడ్ నిబంధ‌న‌ల‌ను కేంద్రం స‌మీక్షిస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హడావుడి ఉన్నందున సీరియ‌స్ గా ఆలోచిస్తోంది. యూపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేక‌పోయిన‌ప్ప‌టికీ పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మిగిలిన మూడు రాష్ట్రాల్లో ప్ర‌తిప‌క్షంగా ఉంది. ఓమిక్రాన్ వేగ‌వంతంగా విజృంభిస్తోన్న ప్ర‌స్తుత త‌రుణంలో రాజ‌కీయ స‌మావేశాల‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యించుకుంది.కోవిడ్ ప్రోటోకాల్‌లపై ఆదేశాల కోసం ఎన్నికల కమిషన్ వైపు కాంగ్రెస్ చూప్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోవిడ్ యొక్క రెండవ తరంగం దేశాన్ని తాకింది. ఆ రాష్ట్రంలో ర్యాలీలను రద్దు చేసిన మొదటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కావ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించడం వల్ల కలిగే పరిణామాలపై లోతుగా ఆలోచించాలని రాహుల్ ఇత‌ర పార్టీల‌కు సూచిస్తున్నాడు. ఆ మేర‌కు గాంధీ ట్వీట్ చేశారు, స‌వ‌రించిన నిబంధ‌న‌ల‌ను కూడా ఆ. ట్వీట్ లో పొందుప‌రిచాడు. రాజకీయ ర్యాలీలను 500 మందికి పరిమితం చేయడంతో పాటు కొన్ని చోట్ల అనుమ‌తి నిరాక‌రిస్తున్నారు. అన్ని రాజ‌కీయ పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ ర్యాలీల‌ను, బ‌హిరంగ స‌భ‌ల‌ను ర‌ద్దు చేసుకుంది. మిగిలిన పార్టీలు రాహుల్ ట్వీట్ ను ప‌ట్టించుకుంటాయా? లేదా అనేది చూడాలి.