Kharges Helicopter : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ప్రతిపక్ష నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించింది. శనివారం రోజు బిహార్‌లోని సమస్తిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది.
BIG BREAKING
Modi govt stoops to yet another low , after Rahul Gandhi now it's Cong President's helicopter to be checked.
Congress President @kharge ji said his helicopter is being investigated by the police and zonal level officials.
The BJP is running more than 100… pic.twitter.com/2N5PqmTPLW
— Ravinder Kapur. (@RavinderKapur2) May 12, 2024
We’re now on WhatsApp. Click to Join
ఎన్‌డీఏ కూటమిలోని పార్టీల నేతల హెలికాప్టర్లను(Kharges Helicopter) తనిఖీ చేయడం లేదు కానీ.. విపక్ష పార్టీల నేతల హెలికాప్టర్లపై ప్రత్యేక నిఘాను పెట్టడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను కూడా కేరళలో ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ బిహార్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి రాజేష్ రాథోర్ ఎక్స్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఖర్గే హెలికాప్టర్‌ను బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి తనిఖీ చేస్తున్న ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఆ వీడియోలో పోలీసులతో సహా ఎన్నికల అధికారులు హెలికాప్టర్‌ను తనిఖీ చేస్తున్న సీన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్డీయే కూటమి నేతల హెలికాప్టర్లను తనిఖీ చేసిన వీడియోలను విడుదల చేయాలని ఈసందర్భంగా రాజేష్ రాథోర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.