Site icon HashtagU Telugu

Congress : ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. 16 మందితో నేషనల్ కమిటీ..

Congress Central Election Committee announced

Congress Central Election Committee announced

వచ్చే సంవత్సరమే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలని ఎలా అయినా గెలవాలని కాంగ్రెస్(Congress) చాలా ట్రై చేస్తుంది. అందుకే దేశంలోని అనేక పార్టీలని కలుపుకొని ఇండియా అనే కూటమిని కూడా ఏర్పాటు చేసింది. కర్ణాటక(Karnataka) ఇచ్చిన గెలుపుతో దేశవ్యాప్తంగా అదే జోష్ తో ముందుకెళ్లడానికి చూస్తుంది.

ఇప్పట్నుంచే రాబోయే ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఇటీవల తమ పొత్తులతో ఉన్న పార్టీలతో వరుస మీటింగ్స్ పెడుతుంది. బీజేపీని(BJP) ఎలాగైనా ఓడించడానికి సన్నాహాలు చేస్తుంది. తాజాగా జాతీయ ఎన్నికల కమిటీని ప్రకటించింది కాంగ్రెస్. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది.

16 మందితో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ప్రకటించింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చింది. కమిటీలో సభ్యులుగా మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, ప్రీతమ్ సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యజ్ఞిక్, పిఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసి వేణుగోపాల్, కేజీ జార్జ్ ఉన్నారు.

 

Also Read : CWC Meeting : హైద‌రాబాద్ లో CWC,అగ్ర‌నేత‌ల రాక‌, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అప్పుడే!