Modi as ‘Jumla boy’, Rahul as ‘New Age Ravan’: రోజు రోజుకు ముదురుతున్న బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్..

బిజెపి కాంగ్రెస్ నేత , ఎంపీ రాహుల్ గాంధీని రావణాసురుడి తో పోలుస్తూ పోస్టర్ ను విడుదల చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించింది.

  • Written By:
  • Updated On - October 6, 2023 / 11:46 AM IST

మొన్నటి వరకు తెలంగాణ లో మాత్రం పోస్టర్ వార్ (Poster War) కొనసాగుతుందని అంత అనుకున్నారు.. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా పోస్టర్ వార్ మొదలైంది. రాబోయే ఎన్నికలను బిజెపి – కాంగ్రెస్ (BJP- COngress)పార్టీలు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ తమ జెండా ఎగురవేయాలని భావిస్తున్నాయి. అందుకే తగ్గట్లే కార్యాచరణ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. అలాగే సోషల్ మీడియా ను సైతం ఇరు పార్టీలు గట్టిగానే వాడుకుంటున్నాయి. ఒకప్పుడు విమర్శలు , ప్రతివిమర్శలు కేవలం మీడియా ముందు , సభలు , సమావేశాల్లో మాత్రం ఉండేవి కానీ ఇప్పుడు అంత సోషల్ మీడియాలో ఉండడం తో రాజకీయ పార్టీలు కూడా తమ విమర్శలను , కౌంటర్లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బిజెపి కాంగ్రెస్ నేత , ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని రావణాసురుడి తో పోలుస్తూ పోస్టర్ ను విడుదల చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించింది. ఇతడో దుష్టశక్తి అని, ధర్మానికి వ్యతిరేకి, రాముడికి విరోధి అని తీవ్ర విమర్శలు చేస్తూ బిజెపి పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌పై కాంగ్రెస్ కూడా అంతే దెబ్బకు..దెబ్బ..ప్రాణానికి ..ప్రాణం అన్నట్లు.. పోస్టర్ కు పోస్టరే సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫ్లాం ఎక్స్‌ (X)లో ప్రధాని మోడీ , అమిత్ షా ల ఫొటోలను షేర్ చేసింది.

‘త్వరలోనే ఎన్నికల ర్యాలీకి వస్తున్నా’ అన్న క్యాప్షన్ పెట్టి ఓ ఫొటోకు ‘బీజేపీ సమర్పణలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నటిస్తున్న ‘జుమ్లాబాయ్’’ అని రాసుకొచ్చింది. ‘అతిపెద్ద అబద్ధాలకోరు ఎవరు?’ అన్న ప్రశ్నకు.. ‘అది నేనే’ అంటూ మోడీ చెయ్యెత్తి చెబుతున్నట్టుగా ఉన్న మరో ఫొటోను షేర్ చేసింది. దీనికి ‘అతిపెద్ద అబద్ధాలకోరు’ అన్న క్యాప్షన్ జతచేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మరి ఈ రెండు పోస్టర్లను చూసి బిజెపి మరో పోస్టర్ ఏమైనా పోస్ట్ చేస్తుందా..ఇంతటితో ఆగిపోతుందా అనేది చూడాలి.

Read ALso: MLC Kavitha: లండన్ కు బయలుదేరిన కవిత, మహిళల భాగస్వామ్యం పై కీలకోపన్యాసం