Site icon HashtagU Telugu

Congress: కాంగ్రెస్ 11వ జాబితా రిలీజ్: ఆ రెండు సీట్లపై ఇంకా వీడని ఉత్కంఠ..

Khammam Congress MP Ticket

india-bloc-edges-past-nda-in-uttar-pradesh-in-early-leads

 

Congress: లోక్‌ సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ 11వ జాబితాలు మంగళవారం విడుదల చేసింది. ఈ లిస్టులో 4 రాష్టాల నుండి 17 మంది అభ్యర్థుల పేర్లను పకటించింది. దీనిలో ఒడిశా నుండి 8 మంది, ఏపి నుండి ఐదుగురు, బిహార్‌లో ముగ్గురు, బెంగాల్‌ నుండి ఒక అభ్యర్థి ఉన్నారు. కాగా సోమవారం విడుదల చేసిన పదో జాబితాలో కేవలం ఇద్దరి పేర్లను మాతమే వెల్లడించింది. మహారాష్టలోని అకోలా, తెలంగాణలోని వరంగల్‌ నుండి మాతమే అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 228కి చేరింది.

We’re now on WhatsApp. Click to Join.

బిహార్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం ఇదే తొలిసారి. సీట్‌ షేరింగ్‌లో భాగంగా కాంగ్రెస్ తొమ్మిది సీట్లు వచ్చాయి. గతంలో ఆ రాష్టంలో ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. తాజా జాబితాలో ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో కిషన్‌ గంజ్‌, కతిహార్‌, భాగల్‌ పూర్‌లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇద్దరు ముస్లిం నేతలకు టిక్కెట్లు దక్కాయి. కిషన్‌గంజ్‌ లోక్‌ సభ స్థానం నుండి కాంగ్రెస్ ఎంపీ మహ్మద్‌ జావేద్‌, కతిహార్‌ నుండి పముఖ నేత తారిఖ్‌ అన్వర్‌ బరిలోకి దిగనున్నారు. భాగల్‌పూర్‌ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్‌ శర్మ పోటి చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌ నుండి డాక్టర్‌ మునీష్‌ తమాంగ్‌ను పోటీలోకి దింపింది. ఏపిలో కడప పార్లమెంటు స్థానం నుండి రాష్ట్ర పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలను ప్రకటించింది.

Read Also: Sensational Decision : ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు

ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ, రాయ్‌ బరేలీ లోక్‌సభ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక్కడి నుండి పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్లలో గతంలో అమేథీ నుండి రాహుల్‌, రాయ్‌ బరేలి నుంచి సోనియా గాంధీలు బరిలోకి దిగగా.. రాహుల్‌ ఓడిపోగా సోనియా గాంధీ గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో వయనాడ్‌ నుండి గెలిచిన రాహుల్‌ మరోసారి అక్కడి నుండి పోటి చేస్తారని భావిస్తున్నారు. ఇక అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ పోటి నుండి తప్పుకోవడంతో ఈ రెండు స్థానాలో ఎవరు పోటి చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుండి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేయాలని కాంగ్రెస్ శేణులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ నేతలో ఉత్కంఠ ఏర్పడింది.

 

Exit mobile version