Congres 2nd List : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు సంబదించిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ (Congress) విడుదల చేసింది. 43 మంది అభ్య‌ర్ధుల‌తో కూడిన రెండో జాబితాలో రాజ‌స్దాన్‌, అసోం, గుజరాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అభ్య‌ర్ధుల‌కు చోటు ద‌క్కింది. అసోం నుంచి 12 మంది, గుజరాత్ నుంచి 7 మంది, మధ్యప్రదేశ్ నుంచి 10 మంది, రాజస్థాన్ నుంచి 10 మంది, డామన్ డయ్యూ నుంచి ఒక్కరి పేర్లను పార్టీ ప్రకటించింది. We’re […]

Published By: HashtagU Telugu Desk
Congress Election Committee

Congress released another list

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు సంబదించిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ (Congress) విడుదల చేసింది. 43 మంది అభ్య‌ర్ధుల‌తో కూడిన రెండో జాబితాలో రాజ‌స్దాన్‌, అసోం, గుజరాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అభ్య‌ర్ధుల‌కు చోటు ద‌క్కింది. అసోం నుంచి 12 మంది, గుజరాత్ నుంచి 7 మంది, మధ్యప్రదేశ్ నుంచి 10 మంది, రాజస్థాన్ నుంచి 10 మంది, డామన్ డయ్యూ నుంచి ఒక్కరి పేర్లను పార్టీ ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో 76.7 శాతం మైనార్టీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారేనని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రెండో జాబితాలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ చోటు కల్పించారు. మధ్యప్రదేశ్‌లో చింద్వారా నియోజకవర్గం నుంచి ఈయన బరిలోకి దిగబోతున్నారు. ప్రస్తుతం స్థానం నుంచి ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. రాజస్థాన్‌లోని జలోర్‌ స్థానం నుంచి పోటీకి నిలబెట్టింది. ఇక అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ గొగోయ్‌ పేరుని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అసోంలోని జోర్హాట్ సీటును కేటాయించింది. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలోని కలియాబోర్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు.

కేరళ(Kerala)లోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయనున్న రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సహా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులను ముందుగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి పోటీ చేసేందుకు నామినేట్ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అలప్పుజ నుంచి పోటీ చేయనుండగా, శశి థరూర్ తిరువనంతపురం నుంచి తిరిగి నామినేట్ అయ్యారు.

Read Also : DSP Praneet Arrest : కీలక నేతల ఫోన్లు ట్యాప్.. డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్

  Last Updated: 12 Mar 2024, 07:23 PM IST