Special Parliament Session: పార్లమెంటు సిబ్బందికి కొత్త యూనిఫామ్‌పై వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. డ్రెస్ కోడ్ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపించారు కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగూర్. డ్రెస్ పై జాతీయ జంతువుపులి , జాతీయ పక్షి నెమలిని ముద్రించకుండా కమలం పువ్వు గుర్తును ఎందుకు ముద్రించారని ప్రశ్నించారు. పార్లమెంటు సిబ్బంది డ్రెస్‌లో పులిని పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు. పార్లమెంటు అన్ని పార్టీలకు అతీతమైనది. మిగతా అన్ని సంస్థల్లో బీజేపీ జోక్యం చేసుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శమన్నారు.
త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ, రాజ్యసభలో పని చేసే సిబ్బందికి ప్రభుత్వం డ్రెస్ కోడ్ కేటాయించింది. చట్టసభ విధుల్లో నిమగ్నమైన వారికి క్రీమ్ కలర్ జాకెట్లు, గులాబీ రంగు కలువలతో ఉన్న క్రీమ్ షర్టులు, ఖాకీ ప్యాంటును యూనిఫామ్‌గా నిర్దేశించారు. 271 మందికి పైగా సిబ్బడికి కొత్త యూనిఫాంలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ యూనిఫార్మ్ డిజైన్‌లను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.