Prajwal Rape Victims: ప్రజ్వల్ అత్యాచార బాధితులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం

జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా.

Prajwal Rape Victims: జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని ఆయన అన్నారు. గత 75 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు జరగలేదని, ఈ నేపథ్యంలోనే వందల సంఖ్యలో ఉన్న అత్యాచార బాధితులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సహాయం ప్రకటించారు అని సుర్జేవాలా చెప్పారు. హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీఎస్,బీజేపీ కూటమి అభ్యర్థి అయిన ప్రజ్వల్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు మరియు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి మేనల్లుడు.

We’re now on WhatsAppClick to Join

ఈ రోజు విలేకరుల సమావేశంలో రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ… సామూహిక రేపిస్ట్ అయిన జెడిఎస్ అభ్యర్థిని కాపాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభియోగాలు మోపారు. ప్రజ్వల్ గురించి సమాచారం ఉన్నప్పటికీ బీజేపీ జేడీ(ఎస్)తో ఎందుకు పొత్తు పెట్టుకుంది?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రజ్వల్ విదేశాలకు పారిపోకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎందుకు అడ్డుకోలేదో కూడా చెప్పాలన్నారు. ‘ప్రజ్వల్ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ప్రధాని ఎందుకు రద్దు చేయలేదని, అతన్ని వెనక్కి తీసుకురావాలని ఇంటర్‌పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీసు ఎందుకు జారీ చేయలేదని సుర్జేవాలా ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య ప్రజ్వల్‌ను వెనక్కి తీసుకురావడానికి బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తామన్నారు.

Also Read: AP Land Titling Act: ఏ1 గా చంద్రబాబు , ఏ2గా నారా లోకేష్