Site icon HashtagU Telugu

CJI Ramana : జ‌ర్న‌లిజంపై ‘సీజేఐ’ చ‌మ‌కులు

CJI Ramana

CJI Ramana

ఒక‌ప్పుడు జర్న‌లిస్టుల‌న్నా, జ‌ర్న‌లిజమ‌న్నా..ఎంతో గౌవ‌రం ఉండేది. ఎన్నో ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాలు స‌మాజాన్ని కాపాడాయి. న్యాయం, ధ‌ర్మం కోసం ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజం చేసే జ‌ర్న‌లిస్టులు అనేక మంది ఉండేవాళ్లు. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. మీడియా అధిప‌తుల వాణిజ్య ధోర‌ణి కార‌ణంగా ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజం వాళ్ల బ్లాక్ మెయిల్ కు బ‌లైంది. ఇప్పుడు ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజం, అలాంటి జ‌ర్న‌లిస్ట‌ల‌కు స్థానం లేకుండా పోయింది. ఆ విష‌యాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌స్తావించారు. ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజం స‌మాజానికి అస‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు

జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ సాండర్స్: ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్ పుస్తకావిష్కరణ సందర్భంగా సీజేఐ ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజం అవ‌స‌రాన్ని ప్ర‌స్తావించారు. జ‌ర్న‌లిస్ట్ గా ఆయ‌న ప‌నిచేసిన స‌మ‌యంలో ప్ర‌చురిత‌మైన ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల‌ను గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిజం ఏ విధంగా సమాజానికి ఉప‌యోగ‌పడిందో..అవ‌లోక‌నం చేసుకున్నారు. ఇటీవ‌ల ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల‌ను ఎక్క‌డా క‌నిపించడంలేద‌ని ఆవేద‌న చెందారు. మీడియా ప‌రిధి నుంచి ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజం లేకుండా పోవడం దుర‌దృష్ట‌మ‌ని అన్నారు. మీడియా ఇప్ప‌టికైనా ఆ దిశ‌గా ఆలోచించాల‌ని సూచించారు.

మహాత్మా గాంధీని ఉటంకిస్తూ, వాస్తవాల అధ్యయనం కోసం వార్తాపత్రికలను చదవాలన్న భావ‌న ఉండేలా స్వీయ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని CJI మీడియా కోరారు. ఎర్ర చంద‌నం విధ్వంసక పథకానికి ఉన్నతమైన మరియు శక్తివంతులు ఎలా ఆజ్యం పోశారో..బ్ల‌డ్ శాండిల్ పుస్తకం వివరిస్తుంది. ఎర్రచందనం జాతులే కాదు, మొత్తం పర్యావరణ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప మరియు కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న పర్యావరణ వ్యవస్థలో జరిగిన అన్ని తప్పుల గురించి ఈ పుస్తకం వివ‌రించింది. ఇలాంటి విలువైన పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న సీజేఐ మీడియాలో అంత‌రించిన ప‌రిశోధ‌నాత్మ‌క జ‌ర్న‌లిజం ఆవ‌శ్యక‌త‌ను గుర్తు చేశారు.