Commercial cylinder : కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 41 రూపాయలు తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈ కారణంగా గ్యాస్ సిలిండర్ల ధరల్లో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు జరుగుతాయి. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటో తేదీ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ధరల సవరణలు చేశాయి. కొన్ని నెలల నుంచి గృహ అవసరాలకు ఉపయోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఎలాంటి మార్పు చేయలేదు. కానీ, వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఉపశమనం కల్పించాయి.
Read Also: Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లపై అసెంబ్లీలో చర్చ.. ఎందుకు ? ఏమైంది ?
19 కిలోల కమెర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఒక్కో సిలిండర్‌పై రూ. 41 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2025 నుంచే అమలులోకి వస్తాయని తెలిపాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1803 నుంచి రూ. 1762కి దిగివచ్చింది. ఈ నిర్ణయంతో వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఉపశమనం కల్పించనుంది. హైదరాబాద్ నగరం సహా తెలుగు రాష్ట్రాల్లో 19 కిలోల కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1985.50 వద్దకు దిగివచ్చింది. ఇక 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 855 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు అన్ని నగరాల్లో రాయితీ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.