Site icon HashtagU Telugu

Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన చేసిన విషయం తెలిసిందే.

రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ మరియు అతిషితో సహా ప్రముఖ ఆప్ నేతలను కటకటాల వెనక్కి నెట్టాలని బీజేపీ భావిస్తోందని కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రధాని ‘జైల్ కా ఖేల్’ ఆడుతున్నారని అయితే రేపు ఆప్ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో కలిసి బీజేపీ కార్యాలయానికి వస్తున్నాను. మీరు ఎవరినైనా జైల్లో పెట్టవచ్చు అని కేజ్రీవాల్ సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది.

మంచి పని చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రులందరినీ కుట్రలో భాగంగా ఒక్కొక్కరిగా జైల్లో పెట్టారన్నారు. ఢిల్లీలో మేం చేసిన పనికి బీజేపీ వాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు. మేము ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌లు, పాఠశాలలు మరియు ఉచిత చికిత్సను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఢిల్లీలోని ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు, కరెంటు ఫ్రీ ఇలా చేయడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే బీజేపీ ఆప్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Silver Price: ల‌క్ష రూపాయ‌ల‌కు చేరువలో కిలో వెండి ధర..?