Site icon HashtagU Telugu

Raju Shrivastava:మెడియన్ రాజు శ్రీ వాస్తవకు జిమ్‌లో గుండె పోటు!!

Raju Imresizer

Raju Imresizer

రాజు శ్రీ వాస్తవ.. ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ ఢిల్లీలోని జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండె పోటుతో కుప్పకూలారు. దీంతో జిమ్ ట్రైనర్స్ శ్రీ వాస్తవాను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఈ వార్త విని పలువురు బాలీవుడ్ స్టార్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీ వాస్తవ త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతి తక్కువ సమయంలోనే  స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌గా శ్రీ వాస్తవ మంచి పేరు తెచ్చుకున్నారు.

కెరీర్ గ్రాఫ్..

* కమెడియన్ రాజు శ్రీ వాస్తవ 25 డిసెంబర్ 1963న ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లో జన్మించారు.
*   బాలీవుడ్‌లో అడుగు పెట్టక ముందు శ్రీ వాస్తవని సత్య ప్రకాష్‌గా పిలిచేవారు. బాలీవుడ్‌లో తనదైన పేరు సంపాదించుకున్న తర్వాత పేరు మార్చుకున్నారు.
* మొదట ‘టీ టైమ్ మనోరంజన్’ అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించారు రాజు శ్రీ వాస్తవ.
* బాలీవుడ్‌ లో రాజు శ్రీ వాస్తవ
గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ ప్రోగ్రాం.

బతుకుదెరువు కోసం రిక్షా నడిపి..

కమెడియన్ కావాలనే కలతో ముంబైకి వచ్చిన రాజు చాలా కష్టాలు పడ్డారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.తన సొంత ఖర్చుల కోసం ఆటో కూడా నడిపారు. ఒక ప్రయాణికుడి పరిచయంతో ఆయన ఈ స్థాయికి ఎదిగారని అంటారు. రాజు ఇటీవల బిగ్ బాస్‌ షో‌లో కూడా భాగమయ్యాడు. షోలో విజయం సాధించలేక పోయిన ప్రేక్షకులను తన కామెడీ తో బాగా అలరించారు. అంతే కాకుండా ఆయన రాజకీయా ప్రవేశం కూడా చేశారు.

Exit mobile version