గుజరాత్ తీరం(Gujarat Coast)లో నార్కోటిక్స్ నియంత్రణ అధికారులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన (worth Rs 1,800 crore) మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 300 కిలోల డ్రగ్స్(300 kg of narcotics)ను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. ఈ నెల 12 మరియు 13 తేదీల రాత్రి సమయంలో అనుమానాస్పద బోట్ ఒకటి గుజరాత్ తీరంలో సంచరిస్తుండగా, నార్కోటిక్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.
CM Chandrababu : దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం : సీఎం చంద్రబాబు
అధికారులు ఘటన స్థలానికి చేరుకునే సమయంలో ఆ బోట్‌లో ఉన్న దుండగులు మత్తు పదార్థాలతో ఉన్న మూటలను సముద్రంలోకి వదిలేసి ఇంటర్నేషనల్ వార్టర్ బోర్డర్ వైపు పరారయ్యారు. కానీ అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వెంటనే నీళ్లలోకి దిగి ఆ మూటలను వెలికి తీసి సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను కట్టడి చేయడంలో కీలక విజయంగా భావిస్తున్నారు.
ఈ ఆపరేషన్‌ను గుజరాత్ ATS, భారత నౌకాదళం (Indian Coast Guard and Gujarat ATS) సంయుక్తంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా దేశానికి ముప్పుగా మారుతున్న సమయంలో జరిగిన ఈ పెద్దస్థాయి ఆపరేషన్‌లో భాగంగా భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం కావడం దేశ భద్రతకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు మరిన్ని దర్యాప్తు జరుపుతున్నారని సమాచారం.