Stock Markets : కేంద్రంలో సంకీర్ణ సర్కారు.. స్టాక్ మార్కెట్లకు మంచిదేనా ?

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వేరు.. ఈసారి వచ్చిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వేరు.. ఆనాడు బీజేపీ సింగిల్‌గా మ్యాజిక్ ఫిగర్ (272 లోక్‌సభ సీట్లు) సాధించింది. 

  • Written By:
  • Publish Date - June 5, 2024 / 03:24 PM IST

Stock Markets : 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వేరు.. ఈసారి వచ్చిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వేరు.. ఆనాడు బీజేపీ సింగిల్‌గా మ్యాజిక్ ఫిగర్ (272 లోక్‌సభ సీట్లు) సాధించింది.  ఈసారి బీజేపీకి 240 లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం చాలా పార్టీల మద్దతును బీజేపీ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలపై కమలదళం ఆధారపడుతోంది. సంకీర్ణ సర్కారు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏమిటి ? అవి ఎలా ప్రభావితం అవుతాయి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

సంకీర్ణ ప్రభుత్వ పాలనా కాలంలో స్టాక్ మార్కెట్స్ రాణించవని కొందరు చెబుతుంటారు. అయితే ఆ అభిప్రాయం సరికాదని పరిశీలకులు అంటున్నారు. వీపీ సింగ్ దేశ ప్రధానిగా ఉన్న టైంలో కేంద్రంలో సంకీర్ణ సర్కారే  ఉండేది. ఆ సమయంలోనూ స్టాక్ మార్కెట్లు 95 శాతం ప్రతిఫలం అందించాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన సమయంలో లేదా బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుందనే అభిప్రాయం సరికాదని పేర్కొంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనా.. ప్రభుత్వ పాలనా విధానాలు సవ్యంగా ఉంటే స్టాక్ మార్కెట్స్ (Stock Markets) రాణించే అవకాశం ఉంటుంది. కాగా, కేంద్రంలో ఏ పార్టీకి కూడా సింగిల్‌గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మంగళవారం రోజు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు 6 వేలకుపైగా పాయింట్లు పడిపోయింది. మార్కెట్ విలువ దాదాపు రూ.లక్షల కోట్లు పడిపోయింది.

Also Read :CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారు : సీఎం రేవంత్

సంకీర్ణ ప్రభుత్వాల టైంలో స్టాక్ మార్కెట్లు ఇలా..

  • 1989-90- వి.పి. సింగ్- 95 శాతం పెరిగిన స్టాక్ మార్కెట్ సూచీలు
  • 1990-91- చంద్రశేఖర్- 2.2 శాతం నష్టపోయిన స్టాక్ మార్కెట్
  • 1991- 1996- పి.వి.నరసింహా రావు- 180.80 శాతం లాభపడిన స్టాక్ మార్కెట్
  • 1996- వాజ్‌పేయీ- 2.6 శాతం నష్టం
  • 1996-97- HD దేవెగౌడ- 2 శాతం లాభం
  • 1997-98- ఐకె గుజ్రాల్- 0.6 శాతం లాభం
  • 1998-2004- వాజ్‌పేయీ- 29.90 శాతం లాభం
  • 2004-2009- మన్మోహన్ సింగ్- 179.90 శాతం లాభం
  • 2009-2014- మన్మోహన్ సింగ్- 78 శాతం లాభం
  • 2014-19- నరేంద్ర మోదీ- 61 శాతం లాభం
  • 2019-2024 – నరేంద్ర మోదీ- 82.80 శాతం లాభపడిన స్టాక్ మార్కెట్

Also Read :Maruti Swift VXI: మారుతి సుజుకిలో అధిక డిమాండ్ ఉన్న కారు ఇదే..!