Site icon HashtagU Telugu

CNG Prices: పెరిగిన సీఎన్‌జీ ధరలు.. ఎక్కడంటే..?

CNG Price

Cng Png Price

CNG Prices: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పరిసర ప్రాంతాల్లో గురువారం సీఎన్‌జీ ధరలు (CNG Prices) పెరిగాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, హాపూర్‌లలో CNG రేట్లు ఒక్క రూపాయి పెరిగాయి. అయితే రేవారిలో ఒక్క రూపాయి తగ్గింది. సిఎన్‌జి కొత్త ధర ఢిల్లీలో కిలో రూ.75.59, నోయిడాలో రూ.81.20, గ్రేటర్ నోయిడాలో రూ.80.20, ఘజియాబాద్, హాపూర్‌లలో కిలో రూ.80.20గా ఉంది. గతంలో రేవారిలో కిలో రూ.82.20 ఉండగా, ఇప్పుడు రూ.81.20కి చేరింది. ఇతర ప్రాంతాల్లో ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెరిగిన ధరలు నవంబర్ 23 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ఐజీఎల్ (ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్) నోటిఫికేషన్ విడుదల చేసింది.

జూలైలో ధర తగ్గింది

ఖరీదైన సీఎన్‌జీ నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం జూలైలో సీఎన్‌జీ ధరను నిర్ణయించే ప్రమాణాలను మార్చడం గమనార్హం. దీని తరువాత ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో CNG ధరలో పెద్ద పతనం నమోదైంది. సాధారణంగా CNG వాహనాలకు ఇంధనంగా, విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఉపయోగించబడుతుంది.

Also Read: Car Explosion: అమెరికా-కెనడా సరిహద్దు సమీపంలో భారీ పేలుడు.. బోర్డర్ మూసివేత..!

ఆగస్టులో కూడా ధరలు పెరిగాయి

అంతకుముందు ఐజిఎల్ ఆగస్టులో ధరలను పెంచింది. ఏడాది వ్యవధిలో రెండోసారి ధరలు పెంచారు. ఆగస్టు 23న కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సీఎన్‌జీ ధర ఒక్క రూపాయి పెరిగింది. అక్టోబర్‌లో ప్రభుత్వం దేశీయ సహజ వాయువు ధరలను పెంచింది. దీని తర్వాత ప్రజలపై ద్రవ్యోల్బణం భారం పడుతుందన్న భయం వ్యక్తమైంది.

We’re now on WhatsApp. Click to Join.

సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతుంది

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న సిఎన్‌జి ధరలు సామాన్య ప్రజలపై, ఎరువులు, విద్యుత్ రంగం, ఉక్కు, పెట్రోకెమికల్స్ వంటి అనేక రంగాల ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఇది ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై కూడా ప్రభావం చూపుతుంది. CNG తర్వాత ఇప్పుడు PNG ధరలు పెరిగే అవకాశం ఉంది.