Site icon HashtagU Telugu

CM Yogi Adityanath: పొగమంచు కారణంగా సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు

CM Yogi Adityanath

CM Yogi Adityanath

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అయోధ్య పర్యటన రద్దయింది. పొగమంచు కారణంగా ఆయన హెలికాప్టర్ లక్నో నుంచి టేకాఫ్ కాలేదు. వెళుతూరు తక్కువగా ఉండడంతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దీంతో సీఎం యోగి రేపు డిసెంబర్ 29న రామ్‌నగరికి వెళ్లనున్నారు.

ప్రధాని మోదీ రాకకు ముందు అన్ని సన్నాహాలను పరిశీలించడానికి సీఎం యోగి ఈ రోజు అయోధ్యకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. కానీ పొగమంచు కారణంగా అతని హెలికాప్టర్ లక్నో నుండి టేకాఫ్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అయోధ్య పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

జనవరి 22, 2024న రామమందిర శంకుస్థాపన జరగనుంది. అంతకంటే ముందు డిసెంబర్ 30న ప్రధాని మోదీ అయోధ్యకు రానున్నారు. నూతనంగా నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో పాటు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అంకింతం చేయనున్నారు. ప్రధాని రాకకు ముందు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

అన్ని ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం యోగి అయోధ్యకు చేరుకోవాల్సి ఉండగా, పొగమంచు కారణంగా ఈరోజు వెళ్లలేకపోయారు. అందుకే ఆయన రేపు అయోధ్యకు వెళతారు. అయితే సీఎం యోగి నిరంతరం అయోధ్యలో పర్యటిస్తూ అన్నింటిని గమనిస్తూనే ఉన్నారు. మందిరానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. డిసెంబర్ 21న అయోధ్య అభివృద్ధి పనుల వాస్తవికతను తెలుసుకునేందుకు సీఎం యోగి అయోధ్యకు వచ్చారు.

Also Read: Prasanth Narayanan: దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ మృతి