Yogi Adityanath: యూపీలో ‘స్కూల్ చలో’ ప్ర‌చారాన్ని ప్రారంభించిన సీఎం యోగి

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 10:12 AM IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ‘స్కూల్ చలో’ ప్ర‌చారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే అత్యల్ప అక్షరాస్యత శాతం ఉన్న జిల్లా శ్రావస్తిలో నెల రోజుల పాటు ఈ ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక‌, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 100 శాతం ఎన్‌రోల్‌మెంట్ ఉండేలా యూపీ సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రావస్తి, బహ్రైచ్, బల్రాంపూర్, బదౌన్, రాంపూర్‌లతో సహా తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాలకు ప్రచారం ప్రాధాన్యత ఇస్తుంది.ఈ ప్ర‌చారాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం యోగి ఆదిత్య‌నాథ్శా.. శాసనసభ్యులు, విద్యా శాఖ అధికారులు ప్రతి పాఠశాలను దత్తత తీసుకోవాలని, అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీలు, స్మార్ట్ తరగతులు, సురక్షితమైన తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాల ఉండేలా కృషి చేయాలని కోరారు.

2017లో ఆపరేషన్‌ కాయకల్ప్‌ను ప్రారంభించిన తర్వాత తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2017లో ఆపరేషన్‌ కాయకల్ప్‌ ప్రారంభించినప్పటి నుంచి యూపీలో 1.34 లక్షల ప్రాథమిక పాఠశాలలు తాగునీటి సౌకర్యాలు, ఫర్నీచర్‌, టాయిలెట్ల నిర్మాణం, స్మార్ట్‌ తరగతులను చేర్చడం, మధ్యాహ్న భోజన నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటితో కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయని..ఇప్పుడు మిగిలిన పాఠశాలలను వాటి ఆధునీకరణ కోసం దత్తత తీసుకోవాలని తాను కోరుకుంటున్నానని యోగీ తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, పంచాయతీ ప్రజాప్రతినిధులు, ఇతరులు తమ తమ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రతి కుటుంబం తమ పిల్లలను పాఠశాలకు పంపేలా చూడాలని కోరారు. ఇదిలా ఉండగా లాంచ్‌లో కొంతమంది విద్యార్థులకు అడ్మిషన్ సర్టిఫికేట్‌లను పంపిణీ చేయగా కొంతమంది వికలాంగ విద్యార్థులకు వినికిడి పరికరాలను ముఖ్యమంత్రి అందజేశారు.