Zero-Tolerance Policy: పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలతో యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దని సీఎం యోగి సంబంధిత అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. యువత భవిష్యత్తుతో ఆడుకోవడం మహా పాపమని, ఈ విషయంలో తప్పులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని, తీసుకునే చ్చర్యలు భవిష్యత్తులో ఉదాహరణగా నిలిచిపోతాయని అన్నారు.
వివిధ శాఖల్లో 1800 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ పేపర్ లీక్ అంశంపై ఫైర్ అయ్యారు. .రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిజాయితీగా ముందుకు సాగకపోతే యువతతో ఆటలాడుకోవడంతోపాటు వారి ప్రతిభకు అన్యాయం చేసినట్టేనని సీఎం చెప్పారు. యువతకు అన్యాయం జరిగితే అది జాతి పాపం. యువత జీవితాలు, భవిష్యత్తుతో ఎవరు ఆటలాడినా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని, ఆ అంశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తొలిరోజు నుంచే నిర్ణయించుకున్నామన్నారు.
యువత భవిష్యత్తుతో ఆటలాడేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకోనుంది.
Also Reas; K Srinivas Reddy : తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డి