Site icon HashtagU Telugu

Cyclone Michaung: చెన్నైలో మిజామ్ తుఫాను, రంగంలోకి సీఎం స్టాలిన్

Cyclone Michaung

Cyclone Michaung

Cyclone Michaung: మిజామ్ తుపాను ధాటికి రాజధాని చెన్నై అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిజామ్ తుపాను తమిళనాడు ఉత్తర కోస్తాలోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో తీవ్ర నష్టాన్ని కలిగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాలు వరద నీటితో చుట్టుముట్టాయి.

చెన్నైలో వడపళని, చూలైమేడు, కోడంబాక్కం, పెరుంగుడి రాయపేట, ఉరప్పక్కం, హార్బర్, ఎన్నూర్, వ్యాసర్పాడి, సైదాపేట, వేలచ్చేరి, మడిపాక్కం, ముడిచూర్, వరదరాజపురంలో వరదనీరు చేరింది. 47 ఏళ్ల తర్వాత ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురువడంతో చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది.దీంతో నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం పడింది. మూడు రోజులుగా పాలు, నీళ్లు, కరెంటు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో మూడో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కార్పొరేషన్ ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పాల్గొంటున్నాయి. అలాగే వరద ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. 4 హెలికాప్టర్ల ద్వారా 16 చోట్ల 950 కిలోల ఆహార పదార్థాలను పంపిణీ చేసినట్లు అధికారికంగా సమాచారం అందింది. ఈ మిక్జామ్ తుపాను కారణంగా ఇప్పటివరకు 17 మంది మరణించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చెన్నైలో తుపాను ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా పరిశీలించారు. వరద బాధిత ప్రజలకు ఆయన ఆహారం పంపిణీ చేశారు.

Also Read: Sourav Ganguly: రోహిత్ శర్మపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ సంచలన వ్యాఖ్యలు