Site icon HashtagU Telugu

Delhi Election : కాంగ్రెస్ హామీలు.. పోస్టర్లు విడుదల చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy released posters of Congress promises

CM Revanth Reddy released posters of Congress promises

Delhi Election : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకిచ్చిన హామీలకు సంబంధించిన పోస్టర్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేంద్రయాదవ్ తో కలిసి ఎన్నికల హామీల పోస్టర్‌ను విడుదల చేశారు. సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. అవినీతిని అడ్డుకుంటే చాలు ఆ నిధులు పేదలకు పంచవచ్చని చెప్పారు. తెలంగాణలో అదే చేశామని అన్నారు. కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు. పెట్టబడుల కోసం దావొస్ వెళ్తున్నాం, వచ్చాక ఎన్ని నిధులు తీసుకొచ్చామో చెబుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

భారత్ జోడో యాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చాం. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించాం అని తెలంగాణ అన్నారు. తెలంగాణలో ఒకేసారి 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదు. అయితే ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నాం. కాబట్టి ఢిల్లీ జనం కాంగ్రెస్ ను గెలిపించాలి. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను.

తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు, 500 కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణా లో అందిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ అన్నారు. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే అన్నారు.

ఈ సందర్భంగా రెండు ఎన్నికల హామీలను ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ తోపాటు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోపే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నెరవేర్చామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ఇస్తున్నామని తెలిపారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. అదే విధంగా పాలనలోకి వచ్చిన ఏడాదిలోపే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.

అయితే తాము ఢిల్లీలో అధికారంలోకి వస్తే విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. యువ ఉడాన్ యోజన కింద నిరుద్యోగులకు ఈ ఆర్థిక సాయం చేయడమే కాకుండాగ, వారి నైపుణ్యాలకు అనుగుణంగా కంపెనీళ్లో పనిచేసేలా చేస్తామని చెప్పింది. అయితే ఇది ఇంట్లో కూర్చినే వారికి కాదని, వారి నైపుణ్యాలు ప్రదర్శించినవారికి డబ్బులు ఇస్తామని తెలిపింది. కాగా, 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న దిల్లీలో పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కింపు ఉంటుంది.

Read Also: Foreign Tour : నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి