ఢిల్లీ పర్యటన (Delhi Tour)లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా (Sonia Gandhi Rahul Gandhi and Priyanka Gandhi ), ప్రియాంకలతో భేటీ అయ్యారు. ఈరోజు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన రేవంత్.. రాహుల్ గాంధీ, సోనియా , ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 100 రోజుల పాలన, గ్యారంటీల అమలుపై రేవంత్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, నేతల చేరికలపైనా సోనియాగాంధీతో రేవంత్ చర్చించారు. అలాగే లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాలపై అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చలు జరుపుతున్నారు.
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీఈసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. మొదటి లిస్టులో మహబూబ్ నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపైన రేపు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. అలాగే మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ కు సంబంధించిన ఫైనలైజేషన్ పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రెండు సమావేశాల్లోనూ రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకు 4 లోక్ సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇంకా 13 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ సహా పెద్దపల్లి, భువనగిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్, నిజామాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా పెండింగ్ లో ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన పట్టును నిలపుకోవడానికి అవసరమైన కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా చేరికలకు గేట్లు ఎత్తేసింది. ప్రతిపక్ష BRS నుంచి పెద్ద ఎత్తున నాయకులను ఆకర్షించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఎంతోమంది కాంగ్రెస్ గూటికి చేరుకొని , ఎంపీ బరిలో ఉన్నారు. ఇప్పుడున్న తన సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోవడంపై దృష్టి సారించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో బిఆర్ఎస్, నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న మూడు కూడా ఖాళీ అయిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను గెలచుకోవడంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
Read Also : Night: పొరపాటున కూడా రాత్రిపూట ఈ పనులు అస్సలు చేయకండి?