Modi : మోడీ ఆ పని చేస్తే 10 లక్షల మందితో సభ పెట్టి సన్మానిస్తా – రేవంత్

Modi : జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది బీసీ నాయకులు, కాంగ్రెస్ మద్దతుదారులు పాల్గొన్నారు

Published By: HashtagU Telugu Desk
Bc Garjana

Bc Garjana

తెలంగాణ(Telangana)లో బీసీ రిజర్వేషన్ల పెంపు (Increase in BC reservations) కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth).. ఇతర బీసీ నాయకులు ఢిల్లీలో మహాధర్నా నిర్వహించారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది బీసీ నాయకులు, కాంగ్రెస్ మద్దతుదారులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాట గర్జనలో తెలంగాణ శాసనసభ ఆమోదించిన 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో కూడా ఆమోదించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఈ డిమాండ్‌ను ఆమోదిస్తే, 10 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి మోడీని సన్మానిస్తామని ప్రకటించారు.

Elon Musk : ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా..మళ్లీ అగ్రస్థానంలో ఎలాన్‌ మస్క్‌

ఈ మహాధర్నాకు పలువురు జాతీయ నేతలు మద్దతు తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మహాధర్నాకు హాజరై తమ మద్దతును ప్రకటించారు. తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీల జనాభా ఆధారంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను అమలు చేయాలని, బీసీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక సబ్ కోటా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో బీజేపీ కూడా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టింది. తెలంగాణలోని HCU (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూములపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే బీసీ మహాధర్నాకు భారీ స్థాయిలో మద్దతు లభించగా, బీజేపీ నిరసనకు స్వల్ప సంఖ్యలోనే మద్దతుదారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఆదర్శంగా చూపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతోంది.

  Last Updated: 02 Apr 2025, 03:27 PM IST