Priyanka Gandhi : కేరళలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. శుభాకాంక్షలు తెలిపారు. వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వీరిద్దరు ప్రియాంకతో సమావేశమై తెలంగాణ రాజకీయాల గురించి చర్చించారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న తెలంగాణ అంశాలపై పార్లమెంటులో ప్రశ్నించాలని వారికి సూచించారు. ఇక సోమవారం రాత్రి స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహ వేడుకకు సీఎం రేవంత్ హాజరైన విషయం తెలిసిందే.
కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని ఖాళీ చేయడంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని కొనసాగించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్ల తేడాతో వాయనాడ్ సీటును గెలుచుకున్నారు. అక్టోబరు 23, 2024న ఉప ఎన్నిక కోసం నామినేషన్ పత్రాలను దాఖలు చేసినప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.
Read Also: BR Naidu : హరీష్ రావుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ