Modi : మోదీ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు – సీఎం రేవంత్

Modi : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశాన్ని విభజించాలన్న గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Cmrevanth Modi

Cmrevanth Modi

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌(Ahmedabad)లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశాన్ని విభజించాలన్న గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

Jitan Ram Manjhi: కేంద్రమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మనవరాలి దారుణ మర్డర్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి తావు లేకుండా చేయడమే తమ లక్ష్యమని రేవంత్ స్పష్టంగా ప్రకటించారు. ‘‘తెలంగాణలో బీజేపీ అడుగు పెట్టనివ్వం. మేము ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నాం. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన కులగణనను మేము అమలు చేసి చూపించాము. కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేయగలమని నమ్మకం ఉంది’’ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల మద్దతుతోనే ఈ విధంగా ధైర్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందన్నారు. రైతులకు రుణమాఫీ చేసి ఆర్థిక భారం తీర్చామని, ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైతులకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని రేవంత్ అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తు కోసం, సామాజిక సమానత్వం కోసం కాంగ్రెస్ పోరాడుతుందని, ప్రజల మద్దతుతో మళ్లీ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో దేశానికి మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు.

  Last Updated: 09 Apr 2025, 08:24 PM IST