CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును వేదికపై నుంచి పిలవాల్సిన సమయంలో, ఆయనను అటల్ బిహారీ వాజ్‌పేయి అని పిలిచారు. ఈ పొరపాటు సభలో హాజరైనవారిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన శుక్రవారం కరకత్‌లో జరిగిన బహిరంగ సభలో చోటు చేసుకుంది. మాట్లాడుతున్న సమయంలో నితీశ్ కుమార్ ప్రధాని మోదీ పేరు చెప్పడంలో తడబడ్డారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అని పొరపాటుగా పిలిచిన వెంటనే, తప్పు తెలుసుకుని దాన్ని కవర్ చేయడానికి “అటల్ జీ అభివృద్ధి పనుల్లో ఎంతో దోహదం చేశారు” అంటూ విషయాన్ని మళ్లించారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ మీమ్స్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను హోరెత్తిస్తున్నారు.
प्रधानमंत्री का भी नाम भूल गए CM नीतीश! अब CM पद पर बने रहने के लिए स्वस्थ नहीं रहे नीतीश कुमार? pic.twitter.com/ZSCM1TLkRZ
— PK FOR CM (@PK_for_CM) May 30, 2025
ఇదే మొదటిసారి కాదు… నితీశ్ వింత ప్రవర్తనలపై పెరిగుతున్న విమర్శలు
ఇటీవల కాలంలో నితీశ్ కుమార్ తరచూ తప్పులు, వింత ప్రవర్తనలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనూహ్యంగా చప్పట్లు కొట్టడం, మార్చిలో పాట్నాలో జరిగిన క్రీడా కార్యక్రమంలో, జాతీయ గీతం వేళ నవ్వుతూ ఇతరులతో సంభాషించడం, ఇలా అన్ని సంఘటనలు వైరల్ వీడియోలుగా మారి, ఆయన ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
నితీశ్ కుమార్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు వేదికపై ఇలాంటి పొరపాట్లు చేయడాన్ని కొందరు హాస్యంగా చూసినా, మరికొంతమంది బాధ్యతా రాహిత్యంగా పరిగణిస్తున్నారు.