CM Kejriwal to Surrender: 3 గంటలకు తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోకసభ ఎన్నికల నిమిత్తం బెయిల్ పని విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజు 3 గంటల ప్రాంతంలో తీహార్ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు.

CM Kejriwal to Surrender: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోకసభ ఎన్నికల నిమిత్తం బెయిల్ పని విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజు 3 గంటల ప్రాంతంలో తీహార్ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు.

తీహార్ జైలులో మధ్యాహ్నం 3 గంటలకు లొంగిపోతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే అంతకుముందు ఆయన కన్నాట్ ప్లేస్‌లోని రాజ్‌ఘాట్, హనుమాన్ ఆలయానికి సీఎం వెళతారు. అక్కడ ఆయన పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. గౌరవనీయులైన సుప్రీంకోర్టుకు నేను చాలా కృతజ్ఞుడను. ఈరోజు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరుతాను. ముందుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తాను. అక్కడి నుంచి కన్నాట్‌ ప్లేస్‌లోని హనుమాన్‌ ఆలయానికి వెళ్లి హనుమాన్‌ ఆశీస్సులు పొందుతాను. ఇక అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, పార్టీ నేతలందరినీ కలుస్తాను. అక్కడి నుంచి మళ్లీ తీహార్‌కు బయలుదేరుతాను’’ అని ఆయన ట్వీట్ చేశారు

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వైద్య కారణాలతో ఏడు రోజుల బెయిల్‌ను కోరుతున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు శనివారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. జూన్ 5న నిర్ణయం ప్రకటించనున్నారు. బెయిల్ అభ్యర్థనకు వైద్యపరమైన కారణాలను కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఉదహరించారు.

Also Read: Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్క రోజే నిర్వహిస్తారా ? : కేటీఆర్