Kejriwal: ఈడీ కస్టడీ నుంచి రెండో సారి సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు

  • Written By:
  • Updated On - March 26, 2024 / 11:19 AM IST

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఈడీ కస్టడీ( ED Custody)లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)… ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ( orders Issuance) చేశారు. మొహల్లా క్లినిక్ లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నీటి సమస్య గురించి సహచర మంత్రి ఆతిశీకి ఆయన నోట్ ద్వారా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు తాము కంప్యూటర్ లేదా పేపర్ ను సమకూర్చలేదని ఈడీ తెలిపింది. అయినా, ఆయన ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయనే దానిపై దృష్టి సారించింది. ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఈ వివాదం సద్దుమణగక ముందే కేజ్రీవాల్ నుంచి రెండో సారి ఆదేశాలు రావడం ఆసక్తికరంగా మారింది.

Read Also:  Honda Activa 7G: భార‌త్‌లో హోండా యాక్టివా 7G లాంచ్ కాబోతోందా..?

కాగా, కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలను ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చదివి వినిపించారు. ‘జైలులో ఉన్నప్పటికీ దిల్లీ ప్రజల ఆరోగ్యంపై కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నాకు ఆదేశాలు జారీ చేశారు. దిల్లీలోని కొన్ని ఆస్పత్రుల్లో, మొహల్లా క్లినిక్​ల్లో ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో లేవు. వాటిని అందుబాటులో ఉంచాలి. కొన్ని ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు కూడా నిర్వహించడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించాలి’ అని తనని ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.