Site icon HashtagU Telugu

Hathras Stampede Tragedy: హత్రాస్‌ బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు

Hathras Stampede Tragedy

Hathras Stampede Tragedy

Hathras Stampede Tragedy: హత్రాస్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషాదానికి సంబంధించి కారణాలపై ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగ్రా, అలీగఢ్ కమీషనర్, ఏడీజీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాద కారణాలను పరిశోధించడానికి ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రమాద ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు కూడా వెనుకాడట్లేదు. అలీఘర్, హత్రాస్, కాస్గంజ్, ఇటా జిల్లాల్లోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సెలవులో ఉన్న వైద్యులు, నిపుణులను ఆసుపత్రుల్లోనే ఉండాలి. మరోవైపు నాలుగు జిల్లాల్లో పోస్టుమార్టం ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

హత్రాస్ జిల్లాలోని ఫుల్రాయ్ గ్రామంలో భోలే బాబా సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 130కి చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా విడుదల చేశారు. హత్రాస్ సంఘటన తర్వాత, జిల్లా మేజిస్ట్రేట్ సాధారణ ప్రజల సహాయం కోసం 05722227041 మరియు 05722227042 హెల్ప్‌లైన్‌లను జారీ చేశారు.

Also Read: CMRF Applications: ఇక నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌