23 Soldiers Missing : సిక్కిం వరదల్లో 23 మంది సైనికులు మిస్సింగ్

23 Soldiers Missing : సిక్కింను కుండపోత వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - October 4, 2023 / 10:21 AM IST

23 Soldiers Missing : సిక్కింను కుండపోత వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. సిక్కింలోని లాచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారని రక్షణ శాఖ గువాహటి కార్యాలయం వెల్లడించింది. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ వరదలోనే  సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. తీస్తా నది పొంగిపొర్లడంతో సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది.

We’re now on WhatsApp. Click to Join

పశ్చిమ బెంగాల్‌-సిక్కింను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయింది. దీంతో పలుచోట్ల రోడ్లను మూసేశారు. హై అలర్ట్ ప్రకటించిన సిక్కిం ప్రభుత్వం..  తీస్తానది సమీప ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసింది. ఆకస్మిక వరదల కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గురి వద్ద దాదాపు 2,400 మంది పర్యాటకులు (23 Soldiers Missing) చిక్కుకుపోయారు. సిక్కింలోని చుంగ్‌తాంగ్‌లోని సరస్సు పొంగిపొర్లడంతో తీస్తా నదికి వరద ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘గజోల్‌డోబా, దోమోహని, మెఖలిగంజ్, ఘిష్ వంటి లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ సూచించింది.

Also read : Gold Medal In Archery: కాంపౌండ్ ఆర్చరీలో భారత్ కు గోల్డ్ మెడల్.. రికార్డు సృష్టించిన భారత్..!