Site icon HashtagU Telugu

CJI Sanjiv Khanna: సీఈసీ, ఈసీల ఎంపిక వ్యవహారం.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ

Chief Justice Of India Cji Sanjiv Khanna

CJI Sanjiv Khanna : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకాలకు సంబంధించిన కమిటీ నుంచి సీజేఐను మినహాయించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీంతో ఈ  పిటిషన్‌‌ను విచారించే ధర్మాసనం నుంచి సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తప్పుకున్నారు. సెక్షన్‌ 7 అమలుపై స్టే విధించాలని ఒక ఎన్జీవో సహా ఇతర సంస్థలు ఈ పిటిషన్‌‌ను వేశాయి.

Also Read :IndiGo Vs Mahindra : మహీంద్రా ఎలక్ట్రిక్‌ వర్సెస్ ఇండిగో.. ‘6ఈ’ కోసం లీగల్ వార్

ఇది ఇవాళ విచారణ కోసం సీజేఐ జస్టిస్ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసుపై గతంలో జస్టిస్‌ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈవిషయాన్ని విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాదులు గోపాల్ శంకరనారాయణ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. ఈ అంశాన్ని విన్న వెంటనే సీజేఐ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna) స్పందిస్తూ.. ‘‘వాదనలను ఇప్పుడు వినలేను’’ అంటూ విచారణ  బెంచ్‌ నుంచి వైదొలిగారు. శీతాకాల విరామం తర్వాత ఈ కేసును సుప్రీంకోర్టులోని మరొక బెంచ్‌ విచారిస్తుందని సీజేఐ తెలిపారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం సహా స్వచ్ఛంద సంస్థలు దీనిపై స్పందన తెలియజేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Also Read :India A Laboratory : ‘‘భారత్ ఒక ప్రయోగశాల’’ అంటున్న బిల్‌ గేట్స్‌.. భారత నెటిజన్ల ఆగ్రహం