CJI English: ఇంగ్లీష్ పాండిత్యంపై సుప్రీమ్ సీజే సెటైర్

ఢిల్లీ పొల్యూషన్ మీద చర్చ జరుగుతున్న సమయంలో ఇంగ్లీషు మీద ఆసక్తి కరమైన సంఘటన సుప్రీమ్ కోర్టులో చోటుచేసుకుంది.

  • Written By:
  • Updated On - November 14, 2021 / 12:18 PM IST

ఢిల్లీ పొల్యూషన్ మీద చర్చ జరుగుతున్న సమయంలో ఇంగ్లీషు మీద ఆసక్తి కరమైన సంఘటన సుప్రీమ్ కోర్టులో చోటుచేసుకుంది. ఇంగ్లీషులో అద్భుతం ఐన స్పీచ్ ఇవ్వలేను అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మీద చీఫ్ జస్టిస్ రమణ సెటైర్ వేశారు. తాను ఎనిమిదో తరగతి నుంచి తర్వాతే ఇంగ్లీష్ తెలుసుకున్నాను అన్నాడు. అందుకు బదులుగా నేను కూడా ఎనిమిది నుంచే నేర్చుకున్నా అని మెహతా తిరుగు సమాధానం ఇచ్చాడు. అప్పటి వరకు గుజరాత్ భాషలో చదివాను అని బదులిచ్చారు. మీ లాగే నేను కూడా లా ఇంగ్లీష్ మీడియం లో చదివాను అంటూ రమణ మీద తిరుగు సెటైర్ వేసాడు.Also Read:

Also Read: `వ‌రి`కంబంపై తెలంగాణ సీఎం కేసీఆర్

ఇదంతా ఢిల్లీలో పొల్యూసీన్ రైతుల కారణంగా వస్తుందని మెహతా వాదించి నప్పుడు జరిగింది. వ్యవసాయ వ్యర్థాలు ఢిల్లీ ని పొగతో నింపుతున్నాయని ప్రభుత్వ వాదన మెహతా వినిపించాడు. కేవలం రైతులు కాదు..దీ పావళి మందులు కాల్చినప్పుడు వచ్చిన పొల్యూషన్ , వాహనాల కారణం గా వచ్చిన పొగ సంగతి ఏమిటని చీఫ్ జడ్జి రమణ అడిగాడు. ఆ సందర్భంగా మెహతా ఇచ్చిన స్పీచ్ గురించి రమణ ఇంగ్లీష్ గురించి సెటైర్ వేసాడు. దీంతో ఇద్దరి మధ్యా ఇంగ్లీష్ మీద ఆసక్తి కరమైన చర్చ జరిగింది.
ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించడానికి వాహనాలను కంట్రోల్ చేయాలని చీఫ్ జస్టిస్ సూచించాడు. అవసరం ఐతే రెండురోజులు లాక్ డౌన్ విధించాలని ఆదేశించాడు.