CJI NV Ramana: తెలుగు భాష మాత్రమే కాదు.. జీవన విధానం!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మన తెలుగువారే అనే విషయం అందరికీ తెలిసిందే.

  • Written By:
  • Updated On - June 26, 2022 / 10:37 AM IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మన తెలుగువారే అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు ఏమాత్రం సమయం దొరికినా తెలుగు పుస్తకాలు చదువుతూ.. తెలుగు కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తుంటారు. తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు.. అది జీవన విధానం నాగరికత అని పేర్కొన్నారు. తెలుగు భాషోద్యమ పోరాటాల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషలో ఉద్యోగాలు రావని కేవలం కల్పితమేనని సీజేఐ ఉద్ఘాటిస్తూనే తాను అందులో చదివి ఉన్నత స్థాయికి ఎదిగానన్నారు. ఉత్తర అమెరికా “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశ పౌరులకు సత్వర న్యాయం జరిగేలా, న్యాయ వ్యవస్థలో కొన్ని సర్దుబాట్లు చేయబడుతున్నాయి’ అని ఈ సందర్భంగా CJI పేర్కొన్నారు.