Kangana : ఎంపీ కంగనా చెంప చెళ్లుమనిపించిన (CISF) కానిస్టేబుల్‌ ఫై వేటు

రైతులను అగౌరపరిచినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు ఆమె తెలిపింది

Published By: HashtagU Telugu Desk
Kangana Cisf Constable

Kangana Cisf Constable

కొద్దీ రోజుల క్రితం ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైనా సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత కంగనా ఢిల్లీకి వెళ్లడానికి చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్‌ కంగనా చెంపచెళ్లుమనిపించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్‌ను కుల్విందర్ కౌర్‌గా గుర్తించారు. రైతులను అగౌరపరిచినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత చాలామంది చిత్రసీమ ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు , రాజకీయ ప్రముఖులు కుల్విందర్ కౌర్‌ కు మద్దతు తెలిపారు. బీజేపి ఎంపీ ఫిర్యాదు మేరకు కుల్విందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా.. సిట్ దర్యాప్తును పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది.

ఇక ఇప్పుడు కుల్విందర్ ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు అధికారులు. కాకపోతే ఆమెపై బదిలీ వేటు వేశారు. కుల్విందర్ ను చండీగఢ్ నుంచి బెంగుళూరు రూరల్ జిల్లా నేలమంగళ తాలూకాలోని డాబస్ టౌన్ సమీపంలోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్సుకు ఆమెను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక కంగనా 2024 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను ఆమె 74,755 ఓట్ల తేడాతో గెలిచింది. రీసెంట్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు.

Read Also : CJI – Stock Markets : బీ అలర్ట్.. రాకెట్ స్పీడుతో స్టాక్ మార్కెట్లు : సెబీకి సీజేఐ సూచన

  Last Updated: 04 Jul 2024, 03:54 PM IST