Site icon HashtagU Telugu

CISF Constable Arrest : హవాలా వ్యాపారి నుంచి రూ.25 లక్షలు దోచుకున్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌

Crime

Crime

హవాలా వ్యాపారి నుంచి రూ. 25 లక్షలు దోచుకున్న కేసులో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ స‌హా ముగ్గురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ద‌ర్యాప్తు చేసి ముగ్గురుని అరెస్ట్ చేశారు. హవాలా వ్యాపారి వ‌ద్ద డ‌బ్బులు దొంగిలించిన రోజు కారు వెళ్లిన మార్గంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలను పోలీసులు శోధిస్తున్నారని నార్త్ డీసీపీ సాగర్ కల్సి తెలిపారు. నిందితులు తన వద్ద రూ. 25 లక్షలు దోచుకున్నారని.. త‌న‌ను ఖాళీ ప్రాంతంలో వ‌దిలి ఆపై కారులో పారిపోయారని వ్యాపారి పోలీసుల‌కు తెలిపాడు. ఈ ఘ‌ట‌న ఫిబ్రవరి 6న ఉత్తర ఢిల్లీలోని మార్కెట్ ప్రాంతంలో జ‌రిగింది. ఫిబ్రవరి 9న కొందరు వ్యక్తులు నోట్లను మార్చుకునేందుకు షహదారాకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వల వేసి సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంఘటనలో పాల్గొన్న ముగ్గురు నిందితులు దోపిడీ ప్లాన్ గురించి CISF కానిస్టేబుల్‌కు చెప్పారని , పోలీసు యూనిఫాం, పోలీసులు ఉపయోగించే వైర్‌లెస్ సెట్‌ను ఏర్పాటు చేయమని కోరినట్లు వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ అడిగినవన్నీ సమకూర్చడమే కాకుండా పోలీసు యూనిఫాంలో మరో ముగ్గురితో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. నాలుగో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.