Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. థియేటర్స్‌లో బయటి ఫుడ్‌ పై తీర్పు..!

మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో తినుబండారాల విక్రయాలపై నిబంధనలను రూపొందించేందుకు అనుమతి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. సినిమా హాల్లోకి ప్రేక్షకులు బయటి ఆహారాన్ని హాల్లోకి తీసుకెళ్లకుండా నిషేధించవచ్చు.

  • Written By:
  • Publish Date - January 4, 2023 / 07:15 AM IST

మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో తినుబండారాల విక్రయాలపై నిబంధనలను రూపొందించేందుకు అనుమతి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. సినిమా హాల్లోకి ప్రేక్షకులు బయటి ఆహారాన్ని హాల్లోకి తీసుకెళ్లకుండా నిషేధించవచ్చు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలకల్ నిర్ణయం తీసుకుంది. అయితే చిన్న పిల్లలకు తల్లిదండ్రులు తెచ్చే ఆహారాన్ని సినిమా హాళ్లు ఆపకూడదని కూడా ధర్మాసనం సూచించింది.

బయటనుంచి ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకురాకుండా అడ్డుకునే హక్కు సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యానికి సంపూర్ణంగా ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఆయా హాళ్ల యాజమాన్యాలదేనని తేల్చి చెప్పింది. సీజేఐ చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. సినిమా అనేది ప్రైవేట్‌ ఆస్తి. సినిమా హాల్ యజమాని హాలులో అదనపు వస్తువులను నిషేధించాలని నిర్ణయించుకోవచ్చు. ఎవరైనా సినిమా హాలులో జిలేబీ తినాలనుకుంటే, దానిని వ్యతిరేకించే హక్కు యజమానికి ఉంది. అందరికీ స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా లభిస్తుంది. శిశువులకు ఆహారం కూడా అనుమతించబడుతుంది. అయితే ప్రతి ఆహారాన్ని ప్రాంగణంలోకి అనుమతించకపోవచ్చు అని ఆయన అన్నారు.

Also Read: Hyderabad : హైద‌రాబాద్‌లో గ్యాంగ్‌స్ట‌ర్ అయూబ్‌ఖాన్‌పై దోపిడీ కేసు న‌మోదు

సినిమా ప్రేక్షకులు తమ ఆహారాన్ని బయటి నుంచి సినిమా హాళ్లకు తీసుకురాకుండా మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్‌లను అడ్డుకోవద్దని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. అటువంటి ఉత్తర్వును జారీ చేయడంలో హైకోర్టు తన అధికార పరిధిని అధిగమించింది. సినిమా హాల్ యజమానులు వ్యాపారం చేసుకునే ప్రాథమిక హక్కుకు అనుగుణంగా రాష్ట్ర పాలనా శక్తి ఉండాలని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు 2018 తీర్పును సవాలు చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన కొన్ని అప్పీళ్లను కోర్టు మంగళవారం విచారించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.