Boeing 737-800 crash : సాంకేతిక లోపం కాదు.. పైల‌ట్లే కావాల‌ని విమానం కూల్చేశారు..

ఈ ఏడాది మార్చి 21న చైనాలో 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్​షీలోని వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూశాయి.

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 06:00 PM IST

ఈ ఏడాది మార్చి 21న చైనాలో 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్​షీలోని వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగానే విమానం కాక్ పిట్ లోని ఎవరో ఒక పైలట్ ఆ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అంటున్నారు. విమానంలో లభించిన బ్లాక్​బాక్స్ (Black Box) సమాచారం ఆధారంగా చేపడుతున్న దర్యాప్తులో ఈవిషయం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చైనా విమానయాన అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. చైనా ఈస్టర్​ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్​ 737 విమానం కున్​మింగ్​ నుంచి గువాంగ్​ ఝౌకు వెళుతుండగా.. వూజౌ నగరానికి నైరుతి దిక్కులో కొంతదూరం ప్రయాణించగానే సమస్య మొదలైంది. విమానం నుంచి సిగ్నల్స్​ ఆగిపోయాయి. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం 30వేల అడుగుల ఎత్తులో ఉంది . కాక్‌పిట్‌లోని ఎవరో ఉద్దేశపూర్వకంగా జెట్‌ను కూల్చివేసినట్లు విమానం శిథిలాల నుంచి బయటపడిన బ్లాక్‌బాక్స్‌ను పరిశీలిస్తే తేలిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 29వేల అడుగుల ఎత్తు నుంచి 3 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో విమానం 9 వేల అడుగుల ఎత్తుకు చేరుకుందని తెలిపింది. 3వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు రావడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయమే పడుతుందని పేర్కొంది. అటువంటి పరిస్థితిలో విమానం కాక్‌పిట్‌లోని ఎవరో పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానం వేగంగా పడిపోయేలా ఏదో చేశారని కథనంలో ప్రస్తావించడం గమనార్హం.