Site icon HashtagU Telugu

Ladakh Standoff: కవ్వింపు చర్యలకు దిగుతోన్న చైనా…జాగ్రత్తగా బదులిస్తోన్న భారత్..!!

Ladhakh

Ladhakh

సరిహద్దులో డ్రాగన్ కంట్రీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమనాలు భారత్ వైపు దూసుకువస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా అంతే ధీటుగా జవాబిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తోంది. భారత్ చైనా సరిహద్దుగా పిలిచే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)వద్ద చైనా యుద్ధ విమానాలు భారత సరిహద్దు సమీపంలోకి దూసుకువస్తున్నాయి.

ఉత్తర లదాఖ్ ప్రాంతంవైపు డ్రాగన్ కంట్రీ విమానాలు దూసుకువస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ ఘటనలు చాలాసార్లు జరిగాయి. గత మూడు నాలుగు వారాల్ల ఇలా చైనా విమానాలు భారత్ వైపు వస్తున్నాయి. కాగా భారత్ మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భారత్ చెందిన మిగ్ -29 యుద్ధ విమానాలు మిరేజ్ 2000 విమానాలను కూడా భారత్ సరిహద్దులోకి పంపిస్తోంది. నిమిషాల వ్యవధిలోనే మన విమానాలు స్పందిస్తున్నాయి. సరిహద్దులో మన వైమానిక సామార్థ్యాన్ని పరీక్షించేందుకు చైనా ఇలా విమానాలను తరచుగా భారత్ వైపు పంపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియా కూడా సమగ్రంగా సిద్ధం అవుతోంది.

Exit mobile version