China Population: రానున్న రోజులు చైనాకు గడ్డురోజులేనట…తగ్గిపోతున్న జనాభా..ఆనాటికి భారతే నెం.1!!

చైనాలో విస్మయానికి గురిచేసే పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. అక్కడ జనాభా భారీగా తగ్గుతోంది. దీనికి సంబంధించి వాషింగ్టన్ వర్సీటీ వేసిన లెక్కలు ఇంట్రిస్టింగ్గా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 06:00 AM IST

చైనాలో విస్మయానికి గురిచేసే పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. అక్కడ జనాభా భారీగా తగ్గుతోంది. దీనికి సంబంధించి వాషింగ్టన్ వర్సీటీ వేసిన లెక్కలు ఇంట్రిస్టింగ్గా ఉన్నాయి. అంతే కాదు భవిష్యత్తులో చైనా పరిస్థిత ఎలా ఉండనుంది. ఈ విషయంపై ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కొన్నెండ్లలో జనాభా భారీగా తగ్గటమే కాదు..నెంబర్ వన్ నుంచి దూరం అవుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం చైనాలో 141కోట్ల జనాభా ఉంది. గతేడాదిలో పెరిగిన జనాభా కేవలం 4.8లక్షలే. 2019లో షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ వేసిన అంచనా ప్రకారం 2021 తర్వాత జనాభా క్షీణత 1.1 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇదేకాదు 2100నాటికి చైనా జనాభా భారీగా తగ్గటం ఖాయం అని చెబుతున్నారు. అకాడమీ అంచానా ప్రకారం 58.7కోట్లకు తగ్గిపోయి..ఇప్పుడున్న 141కోట్ల జనాభా స్థానాన్నే 109కోట్లకు తగ్గనున్నట్లు చెబుతున్నారు. అప్పటికీ భారత జనాభా పెరిగి 144.7కోట్లకు చేరుతుందని…దీంతో నెంబర్ వన్ ప్లేస్ పోయి…నెంబర్ టూర్ కు తగ్గాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇక 2100నాటికి భారత్ మొదటిస్థానంలో…చైనా రెండో స్థానంలో…నైజీరియా మూడోస్థానంలో నిలుస్తుందట. తర్వాతస్థానంలో అమెరికా 43.4కోట్లు, పాకిస్తాన్ 40.3కోట్లు ఉంటుందట.

ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అనే విధానాన్ని తీసేసినా…జనాభా నియంత్రణను చైనీయులు పక్కాగా పాటిస్తున్నారు. సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లల్ని కనేందుకు చైనా మహిళలు ఆసక్తిని చూపించడం లేదట. కోవిడ్ తర్వాత గర్భాధారణకు అక్కడి మహిళలు ఆసక్తిని చూపించడం లేదని తేలింది. 1980లో అక్కడి సంతానోత్పత్తి రేటు 2.6శాతం ఉండగా ప్రస్తుతం అది కాస్తా 1.15 శాతానికి తగ్గిందట. చిన్న కుటుంబాలకు అలవాటుపడిన వాళ్లు…పెద్ద కుటుంబాలకు అస్సలు ఇంట్రెస్టు చూపించడం లేదని చెబుతున్నారు.

వీటన్నింటికి తోడు జీవన వ్యయం పెరగడం, వివాహ వయస్సు పెంచడం, మరో సమస్య ఎదురవుతోంది. పనిచేసే వారి సంఖ్య తగ్గి..65 ఏళ్లకు పైబడిన పెద్ద వయస్కుల సంఖ్య పెరిగిపోయింది. వందమంది పనిచేసే వయస్సులో ఉన్నవారు 20 మంది వ్రుద్ధులను చూసుకోవల్సి వస్తుంది. 2100నాటికి వందమంది 120మందిని చూసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అదే జరిగే చైనా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుందంటున్నారు. కార్మికుల సంఖ్య తగ్గిపోతే…కార్మిక వ్యయం ఎక్కువ అవుతుందని…కార్మిక వ్యయం చౌకగా ఉంటే భారత్…వియాత్నం, బంగ్లాదేశ్ వంటి దేశాలకు వెళ్లిపోతారని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే చైనాకు రానున్న రోజులు మంచివి కావని అర్థం అవుతోంది.