China on Bipin Rawat Death :హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై ‘చైనా’ పిచ్చికూత‌లు

ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే స‌హ‌జంగా బాధ ప‌డ‌తాం. అలాంటి బాధ లేక‌పోగా, భార‌త త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై చైనా సిగ్గులేని వ్యాఖ్య‌లు చేసింది.

  • Written By:
  • Updated On - December 10, 2021 / 12:40 PM IST

ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే స‌హ‌జంగా బాధ ప‌డ‌తాం. అలాంటి బాధ లేక‌పోగా, భార‌త త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై చైనా సిగ్గులేని వ్యాఖ్య‌లు చేసింది. దాని అధికార ప‌త్రిక `గ్లోబ‌ల్ టైమ్స్` లో బిపిన్ పై ఉన్న ఈర్ష్య‌ను వెళ్ల గ‌క్కింది. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం భార‌త సైన్యం నిర్ల‌క్ష్యాన్ని సూచిస్తోంద‌ని కామెంట్ చేసింది. అంతేకాదు, భార‌త్ సైన్యం యుద్ధానికి స‌న్న‌ద్ధంగా లేద‌ని సిగ్గులేని రాత‌లు రాసింది. నైపుణ్యంలేని సైన్యం అంటూ ఇష్టానుసారంగా వ్యాఖ్య‌లు చేస్తూ భార‌త్ మీద ఉన్న ఆక్రోశాన్ని వెలుబుచ్చింది.సీడీఎస్ బిపిన్ రావ‌త్ తో పాటు 13 మంది హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాడు నీల‌గిరి అడ‌వుల్లో జ‌రిగిన ఈ ప్ర‌మాదంపై బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామితో పాటు ప‌లువురు అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. లేజ‌ర్ అటాక్ జ‌రిగి ఉండొచ్చ‌ని కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిప్రాయాల‌ను వెలుబుచ్చుతున్నారు. చైనా ప్ర‌మేయంపై కూడా మ‌రికొంద‌రు అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. వీటికి బ‌లం చేకూరేలా చైనా అధికారక ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ రాసిన పిచ్చి రాత‌లు ఉన్నాయి.

త‌మిళ‌నాడులోని కూనూరు వ‌ద్ద జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో 13 మంది మృతి చెందారు. పైలెట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఐసీయూలో ఉన్నాడు. చ‌నిపోయిన వాళ్ల మృత‌దేహాల‌ను ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ త‌ర‌లించారు. అంత్య‌క్రియ‌లను ఆర్మీ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర‌ప‌తి కోవింద్‌, ప్ర‌ధాని మోడీతో స‌హా ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. త్రివిధ ద‌ళాధిప‌తి రావ‌త్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి మ‌రో 10 చ‌నిపోయిన సంఘ‌ట‌నపై యావ‌త్ భార‌త్ శోక‌సంద్రంలో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో చైనా చేసిన వ్యాఖ్య‌లు స‌గ‌టు భార‌తీయునికి సైతం ఆగ్ర‌హం క‌లిగిస్తున్నాయి.తొలి నుంచి రావ‌త్ మీద చైనా ఆక్రోశాన్ని వెలుబుచ్చేది. స‌రిహ‌ద్దుల్లోని చైనా గెరిల్లా సైన్యానికి ధీటుగా పోరాటం చేయ‌డానికి సిద్ధం అయ్యాడ‌ని ఆ దేశానికి కోపం. అంతేకాదు, ల‌ఢ‌క్, పూల్వామా సంఘ‌ట‌న‌ల త‌రువాత ఏం జ‌రిగిందో..చైనాకు బాగా తెలుసు. యుద్ధ వ్యూహ ర‌చ‌న‌లో బిపిన్ చాణ‌క్యుడ‌ని డ్రాగ‌న్ సైన్యానికి అవ‌గాహ‌న ఉంది. అందుకే, భార‌త సైన్యం దూకుడుకు చైనా వారం క్రితం వెన‌క్కు త‌గ్గింది. భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దుల్లోని వివాద‌స్ప‌ద భూభాగంలో నిర్మాణాల‌ను నిలిపివేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం బిపిన్ రావ‌త్ యుద్ధ విన్యాసాల‌ని చైనాకు బోధ‌ప‌డింది. చైనాకు ఎప్పుడు వ్య‌తిరేకంగా బిపిన్ రావ‌త్ ఉండే వాళ్లు. ఆ దేశ సైన్యంపై విజ‌యం ఎలా సాధించాల‌నే దానిపై ఎప్పుడూ దిశానిర్దేశం చేసే వాళ్ల‌ట‌. ఆ విష‌యం తెలుసుకున్న చైనా కూడా బిపిన్ రావ‌త్ పై ఎప్పుడూ వ్య‌తిరేకంగా ఉండేది. ఇప్పుడు అక‌స్మాత్తుగా హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో చైనా శునాకానందం పొందుతోంది. శోకంలో ఉన్న యావ‌త్ భార‌త్ ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేయ‌డం చైనా దిగ‌జారుడుకు నిద‌ర్శ‌నం..