Site icon HashtagU Telugu

China Pneumonia: చైనాలో న్యుమోనియా..ఇండియాలో మరోసారి లాక్ డౌన్..?

China Pneumonia

China Pneumonia

China Pneumonia: కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి మొదలైంది. ప్రస్తుతం చైనాలో న్యుమోనియా దారుణంగా ప్రబలుతోంది. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఉత్తర చైనాలో ఈ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ కోవిడ్‌లాంటి పరిస్థితి వస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే తాజాగా భారత ప్రభుత్వం చైనా న్యుమోనియాపై స్పందించింది. ఎలాంటి భయాలు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

చైనాలో న్యుమోనియా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ప్రజారోగ్యం మరియు ఆసుపత్రి పరిస్థితుల్ని అంచనా వేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆసుపత్రులలో తగినంత మానవ వనరులు, ఆసుపత్రి పడకలు, అవసరమైన మందులు, మెడికల్ ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, వ్యక్తిగత రక్షణ పరికరాలు , టెస్టింగ్ కిట్లు,ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు COVID-19 సమయంలో తీసుకున్న మార్గదర్శకాలను అమలు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

Also Read: Telangana: కేసీఆర్ నడిచే రోడ్డు, చదివిన పాఠశాల కాంగ్రెస్‌ నిర్మించిందే: రాహుల్