Site icon HashtagU Telugu

NCPCR: వీధుల్లో నివ‌సిస్తున్న పిల్ల‌లు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ..?

Ncpcr

Ncpcr

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) దేశవ్యాప్తంగా 17,914 మంది వీధుల్లో పిల్ల‌లు నివ‌సిస్తున్న‌ట్లు గుర్తించారు. ఇదే విష‌యాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వీధుల్లో నివసించే పిల్లల సంఖ్య మహారాష్ట్రలో అత్యధికంగా ఉందని కమిషన్ పేర్కొంది. సోమవారం సుప్రీంకోర్టులో కమిషన్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, 17,914 మంది వీధుల్లో నివసిస్తున్నారు. పగటిపూట కానీ రాత్రి సమయంలో మురికివాడల్లో నివసించి తిరిగి వారి కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు వెళ్తారు.. వారిలో బాలురు 10,359 మంది, బాలికలు 7,554 మంది ఉన్నారు .

వీధుల్లో నివసించే పిల్లలపై దాఖ‌లైన‌ రిట్ పిటిషన్‌లో జనవరి 17న సుప్రీం కోర్టు ఆదేశాలకు ప్రతిస్పందనగా NCPCR తన సమ్మతి అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ తాజా డేటా ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రాలచే సంకలనం చేయబడింది మరియు కమిషన్ రూపొందించిన పోర్టల్ అయిన “బాల్ స్వరాజ్”లో అప్‌లోడ్ చేయబడింది. 7,522 మంది పిల్లలు వీధుల్లో నివసిస్తున్నారని వయస్సు వారీగా 8-13 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల సమూహం, తర్వాత 4-7 సంవత్సరాల మధ్య వయస్సు గల 3,954 మంది పిల్లలు ఉన్నారని NCPCR తెలిపింది.

మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో వీధి బాలలు 4,952 మంది ఉన్నారు, ఆ తర్వాత గుజరాత్ (1,990), తమిళనాడు (1,703), ఢిల్లీ (1,653) మరియు మధ్యప్రదేశ్ (1,492) ఉన్నారని డేటా మరింత వెల్లడిస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 270 మంది పిల్లలు వీధుల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. మతపరమైన ప్రదేశాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు మరియు పర్యాటక ప్రదేశాలలో వీధి పిల్లలు ఎక్కువగా కనిపిస్తారని కమిషన్ తెలిపింది. NCPCR 17 రాష్ట్రాల్లోని 51 మత స్థలాలను కూడా గుర్తించింది.