Childrens Seats : విమానాల్లో పేరెంట్స్ పక్కన సీట్ల కేటాయింపు జరగక పిల్లలు తరుచుగా అసౌకర్యానికి గురవుతుంటారు. పేరెంట్స్‌కు, పిల్లలకు వేర్వేరు చోట్ల సీట్లు పడుతుంటాయి. దీనివల్ల వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ అసౌకర్యానికి చెక్ పెట్టే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్ లైన్స్ కంపెనీలను డీజీసీఏ ఆదేశించింది.
ఫిర్యాదులు వెళ్లడంతో..
పిల్లలు తమ పేరెంట్స్ లేదా గార్డియన్స్‌తో విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో చాలాసార్లు తమ పెద్ద వాళ్లకు దూరంగా కూర్చోవాల్సి వస్తోంది. దీనిపై డీజీసీఏకు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిని పరిశీలించిన డీజీసీఏ మన దేశంలోని విమానయాన సంస్థలకు పై ఆర్డర్స్ ఇచ్చింది. పిల్లలకు అసౌకర్యాన్ని నివారించేందుకు చొరవ చూపాలని.. పేరెంట్స్‌కు సీట్లను కేటాయించే క్రమంలో వాళ్ల పిల్లలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. పేరెంట్స్ ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశాన్ని పిల్లలకు కల్పిస్తే.. వారి ఫ్లైట్ జర్నీ హ్యాపీగా జరుగుతుందని తెలిపింది. పిల్లలకు పేరెంట్స్ వద్ద సీటును(Childrens Seats) కేటాయిస్తే.. ఆ వివరాలను తప్పకుండా ప్రయాణ రికార్డులలో నమోదు చేయాలని కోరింది.
We’re now on WhatsApp. Click to Join
ప్రిఫరెన్షియల్ సీటింగ్
ఈమేరకు రూల్స్‌ను సవరించి ‘అన్ బండిల్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఫీస్ బై షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్’ అనే పేరుతో ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్‌ను డీజీసీఏ జారీ చేసింది. ప్రిఫరెన్షియల్ సీటింగ్ అనే అంశాన్ని ఇందులో ప్రస్తావించింది. ప్రయారిటీ ప్రకారం విమాన టికెట్ల కేటాయింపును ఈ నిబంధన వివరిస్తుంది. విమానం బయలుదేరే టైం వరకు వెబ్ చెకిన్ కోసం ఏ సీటునూ ఎంచుకోని ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా సీటును కేటాయించే నిబంధన కూడా సవరించిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్‌లో ఉంది. దీని ద్వారా జీరో బ్యాగేజీ ఛార్జీలు, భోజనం/స్నాక్/డ్రింక్ ఛార్జీలు, సంగీత వాయిద్యాల క్యారేజ్ కోసం ఛార్జీలను నిర్ణయించారు.