Site icon HashtagU Telugu

Mumbai : సీఎం ఏక్నాథ్‌ షిండేతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటి

Chief Minister Chandrababu meet with CM Eknath Shinde

Chief Minister Chandrababu meet with CM Eknath Shinde

Chief Minister Chandrababu: ఏపి సీఎం చంద్రబాబు మహరాష్ట్ర సిఎం ఏక్నాథ్‌ షిండే(CM Eknath Shinde)తో ఈరోజు భేటి అయ్యారు. ముంబయిలోని షిండే నివాసంలో వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు షిండే..ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఇరువురి మధ్య సమావేశం జరిగింది. ఎన్డీయే కూటమి భాగస్వాములైన చంద్రబాబు, షిండే పలు అంశాలపై చర్చించుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సంకీర్ణ కూటమిలో టీడీపీ, శివసేన వర్గం భాగస్వామ్య పార్టీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఏక్నాథ్ షిండేతో ఏపి సీఎం చంద్రబాబు సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ రిసెప్షన్ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ముంబయిలోని జియో వరల్ సెంటర్ లో ఘనంగా ముగిసింది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యారు. పీఎం మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు రాత్రికి ముంబయిలోనే బస చేశారు. ముంబయిలోని వర్ష భవన్ లో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను కలిశారు.

Read Also: CM Revanth Reddy : ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి